మియాపూర్ మెట్రోస్టేషన్ సమీపంలో చిరుత సంచారం కలకలం రేపింది. చిరుత సంచరిస్తోందని తెలుసుకున్న స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానం ఈవో డి.పెద్దిరాజును బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పెద్దిరాజును తన మాతృ సంస్థకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
మంత్రి లోకేష్‌కు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఓ విజ్ఞప్తి చేశారు. రాయలసీమలో మహిళలకు ప్రత్యేక ఇంజనీరింగ్ కళాశాల కోసం విద్యా మంత్రి లోకేష్‌ను మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం తెలుగు వారి కోసం అంతర్జాతీయంగా అనేక సాంకేతిక అవకాశాలను అందిపుచ్చుకుని అద్భుతాలు సాధించిందన్నారు.
ఏపీ ప్రభుత్వం ఇసుక విషయంలో గుడ్‌న్యూస్ చెప్పింది.ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను ట్రాక్టర్లల్లో తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో స్థానిక అవసరాలకు ఇసుకను తీసుకెళ్లేందుకు కేవలం ఎడ్ల బండ్లకు మాత్రమే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.
మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు పోలీస్ కస్టడీ విధిస్తూ మంగళగిరి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామానికి చెందిన మహిళ హత్య కేసులో రిమాండ్ ఖైదీ నందిగం సురేష్ ను పోలీస్ కస్టడీకి ఇస్తూ మంగళగిరి కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 26వ తేదీ నుంచి తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. దేశంలోనే మొట్టమొదటిసారి కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించామన్నారు. సాధారణ సభ్యత్వ రుసుము ఎప్పటిలాగా రూ.100 ఉంటుందని.. ఈ ఏడాది నుంచి కొత్తగా లైఫ్ టైం సభ్యత్వాన్ని ప్రవేశపెడుతున్నాం.. దీని రుసుము రూ.1,00,000 గా నిర్ణయించామన్నారు.
ఏపీ వ్యాప్తంగా 90 శాతం మద్యం షాపులు తెరుచుకున్నాయి. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం నాటికి 100 శాతం అన్ని మద్యం షాపులు తెరచుకోనున్నాయి. ఇప్పటి వరకు 7 లక్షల కేసులు లిక్కర్, బీరు కేసులు డిపోల నుంచి సరఫరా అయింది. మద్యం అమ్మకాల ద్వారా ఇప్పటి వరకు రూ. 530 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిసింది.
అమరావతి డ్రోన్ సమ్మిట్‌పై వివిధ శాఖల సెక్రెటరీలు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో ఏపీ సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 22, 23 తేదీలలో అమరావతి డ్రోన్ సమ్మిట్ జరగనుంది.
ఇటీవల కాలంలో మానవ సంబంధాలకు అసలు విలువే లేకుండా పోయింది. క్షణకాల సుఖం కోసం నీచమైన పనులు చేయడానికి కూడా మనుషులు సిద్ధమవుతున్న తీరు సభ్యసమాజం భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తోంది. ఏకంగా వావి వరసలు మరిచిపోయి మృగాల్లా ప్రవర్తిస్తున్నారు కొందరు దుర్మార్గులు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఈ మధ్యకాలంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం నాగటూరులో దారుణం జరిగింది.
అక్టోబర్ 21న సంస్మరణ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహిస్తున్నామని.. ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఏపీ డీజీపీ ద్వారక తిరుమల రావు పేర్కొన్నారు. అక్టోబర్ 21 నుండి 31 వరకు పదిరోజులు సంస్మరణ దినోత్సవాలు జరుపుతున్నామని ఆయన తెలిపారు.