Hyderabad: మియాపూర్ మెట్రోస్టేషన్ సమీపంలో చిరుత సంచారం కలకలం రేపింది. చిరుత సంచరిస్తోందని తెలుసుకున్న స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిరుత సంచారం గురించి స్థానికులు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు, అటవీ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకుని చిరుత ఆనవాళ్లు గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. మియాపూర్ మెట్రో స్టేషన్ వెనుక భాగంలో ఇప్పటికే తవ్వకాలు జరిగాయి. ఆ తవ్వకాలు జరిగిన స్థలం నుంచే చిరుత వెళ్లినట్లు వీడియోలో కనిపిస్తోంది. అటవీ శాఖ అధికారులు దీనిని నిర్ధారించాల్సి ఉంది. స్థానికులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Read Also: Minister Satya Kumar Yadav: మంత్రి లోకేష్‌కు మంత్రి సత్యకుమార్ యాదవ్ వినతి