కేరళ తరహాలో తీర ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేయాలని, అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో మత్స్య శాఖపై మంత్రి అచ్చెన్నాయుడు మత్స్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎమ్.ఎమ్.నాయక్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు.
కార్తీక మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తుల చూపు మొత్తం ఎన్టీవీ-భక్తి టీవీ నిర్వహించే కోటిదీపోత్సవంపైనే ఉంటుంది.. ఈ ఏడాది కూడా ఘనంగా కోటిదీపోత్సవ యజ్ఞాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది భక్తి టీవీ.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నవంబర్ 9 నుంచి 25 వరకు కోటిదీపోత్సవ మహాయజ్ఞం జరగనుంది.
రాష్ట్రంలో పెట్టుబడులకు కొత్త పాలసీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం పలికారు, బెస్ట్ పారిశ్రామిక పాలసీలతో ఏపీ ఇప్పుడు పెట్టుబడులకు సిద్దంగా ఉందంటూ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. ఏపీలో కార్యకలాపాలకు పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ స్వాగతం అంటూ ముఖ్యమంత్రి స్వాగతం పలికారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తగిన సమయం ఉంటుందని, పార్టీని మరింత పటిష్టం చేయడానికి మంచి అవకాశం ఉంటుందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పేర్కొ్న్నారు. ప్రతిక్షంగానూ, అధికారంలోనూ, మళ్లీ ఇప్పుడు ప్రతిపక్షంగానూ పార్టీ ఉందన్నారు. అన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలతో వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. 15 ఏళ్లలో పార్టీ ప్రస్థానం ముందుకు సాగిందన్నారు. కాకపోతే మనం ఆర్గనైజ్డ్‌గా యుద్ధంచేస్తున్నామా? లేదా? అన్నది చాలా ముఖ్యమని పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగితేనే అది మంచి ఫలితాలను ఇస్తుందన్నారు.
మంగళగిరి పోలీస్‌స్టేషన్ వద్దకు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేరుకున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జల రామకృష్ణా రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో సజ్జలను పోలీసులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. మంగళగిరి పోలీస్‌స్టేషన్ దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలోని ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్య పూర్తి చేసిన ప్రతిఒక్కరికీ ఉద్యోగం లభించే విధంగా పాఠ్యప్రణాళికను ప్రక్షాళన చేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో స్కిల్ డెవలప్‌మెంట్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... తమ హయాంలో ఐటీఐ, పాలిటెక్నిక్ చదివిన ప్రతి విద్యార్థికి ఉద్యోగం రావాలన్నది తమ లక్ష్యమని చెప్పారు.
తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలోనే ఉంటూ జిల్లా కలెక్టర్లకు ఎప్పటికప్పుడు తగు ఆదేశాలిస్తున్నారు.
బీసీలకు ఇచ్చిన ఎన్నికల హామీని అమలు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది. బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై ప్రక్రియపై కసరత్తు జరుగుతోంది. రేపు సెక్రటేరీయేట్‌లో బీసీ మంత్రులు భేటీ కానున్నారు. రేపు మూడు గంటలకు 8 మంది బీసీ మంత్రులు భేటీ కానున్నారు. బీసీలకు మేలు కలిగేలా సీఎం చంద్రబాబు మరో నిర్ణయం తీసుకోనున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఈడీ దూకుడు పెంచింది. 23 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. .ఢిల్లీ, ముంబై ,పుణెలలోని సిమెన్స్ కంపెనీ ఆస్తులను అటాచ్ చేసింది. ఏపీ సీఐడీ కేసు ఆధారంగా ఈడీ విచారణ జరుపుతోంది.
దక్షిణ మధ్య బంగాళాఖాతంలో మరింత బలపడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తుందని విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలో రానున్న మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నామన్నారు.