AP Liquor: ఏపీ వ్యాప్తంగా 90 శాతం మద్యం షాపులు తెరుచుకున్నాయి. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం నాటికి 100 శాతం అన్ని మద్యం షాపులు తెరచుకోనున్నాయి. ఇప్పటి వరకు 7 లక్షల కేసులు లిక్కర్, బీరు కేసులు డిపోల నుంచి సరఫరా అయింది. మద్యం అమ్మకాల ద్వారా ఇప్పటి వరకు రూ. 530 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిసింది.
Read Also: Amaravati Drone Summit 2024: డ్రోన్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
ఇదిలా ఉండగా.. 99 రూపాయల క్వార్టర్ బాటిల్ పూర్తి స్థాయిలో నెలాఖరు నాటికి అందుబాటులోకి వస్తుందని ఏపీ ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్ వెల్లడించారు.ప్రస్తుతం రోజుకు 10 వేల కేసులు సరఫరా చేస్తున్నామన్నారు. డిమాండ్ బట్టి త్వరలో సప్లై పెంచుతామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఎమ్మార్పీ ప్రకారం మాత్రం అమ్మకాలు చేయాలని ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. ధరలపై కమిటీ ఇచ్చే నివేదిక బట్టి మళ్ళీ రివైజ్ చేస్తామన్నారు. సిండికేట్ల వల్ల ఇబ్బందులు ఉంటే ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. మాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. అన్ని షాప్స్ రేపటికి ఓపెన్ అవుతాయని ఆయన వెల్లడించారు. ఎమ్మార్పీ ధరల కంటే వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని ఏపీ ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్ హెచ్చరించారు.