AP Crime: ఇటీవల కాలంలో మానవ సంబంధాలకు అసలు విలువే లేకుండా పోయింది. క్షణకాల సుఖం కోసం నీచమైన పనులు చేయడానికి కూడా మనుషులు సిద్ధమవుతున్న తీరు సభ్యసమాజం భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తోంది. ఏకంగా వావి వరసలు మరిచిపోయి మృగాల్లా ప్రవర్తిస్తున్నారు కొందరు దుర్మార్గులు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఈ మధ్యకాలంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం నాగటూరులో దారుణం జరిగింది. నాగటూరులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది.
Read Also: DGP Dwaraka Tirumala Rao: అక్టోబర్ 21 నుండి 31 వరకు సంస్మరణ దినోత్సవాలు
ఓ మహిళ తన పొలంలో పనిచేసుకోవడానికి ఎప్పటిలాగే వెళ్లింది. ఈ క్రమంలోనే మొక్కజొన్న కంకులు ఏరడానికి వచ్చిన కోడలుపై మామ కురుమన్న అత్యాచారయత్నం చేశాడు. ఆమె తన మామ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. కోడలు శిరీష (35) తిరస్కరించడంతో మామ కురుమన్న ఆగ్రహంతో ఊగిపోయాడు. అక్కడ పక్కనే ఉన్న బండరాయితో కోడలు శిరీషను మామ కురుమన్న కొట్టి చంపేశాడు. బండరాయితో కొట్టడంతో ముఖం నుజ్జు నుజ్జు అయి శిరీష అక్కడికక్కడే మృతి చెందింది. తల్లి మృతితో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.