తిరుమల వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు అధిక ధరలకు అమ్ముతున్నారని ఓ భక్తుడు టీటీడీ విజిలెన్స్ వింగ్‌కు ఫిర్యాదు చేశాడు. వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను బెంగళూరుకు చెందిన సాయి కుమార్‌కు అధిక ధరకు విక్రయించిన ఓ ప్రజాప్రతినిధి. వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం బ్లాక్‌లో వీఐపీ దర్శన టికెట్లు అమ్ముకున్నట్లు ఓ భక్తుడు ఫిర్యాదు చేశాడు.
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చింది.. తిరుమలలో శ్రీవారి దర్శనానికి.. వివిధ సేవలకు సంబంధించిన టికెట్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.. ఇప్పటికే ఈ ఏడాది ఆర్జిత సేవా టికెట్ల కోటా పూర్తి కాగా.. ఆన్‌లైన్‌లో జనవరి నెల ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది.
ఇంటర్ చదువుతున్న మైనర్ బాలికపై పెట్రోల్‌పోసి నిప్పు పెట్టి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన వైఎస్‌ఆర్ కడప జిల్లా బద్వేల్‌లో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బద్వేల్ పట్టణంలో ప్రేమ పేరుతో యువకుడి చేతిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది.
ఈ నెల 23న జరగాల్సిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం 26వ తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. ఈ నెల 26న సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుందని తెలిపారు.
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు సోమవారం నుంచి జరుగుతున్నాయని.. ఈ పరీక్షల కోసం ఎన్నో ఏళ్లుగా నిరుద్యోగులు నిరీక్షిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాలయాపనకు ఫుల్‌స్టాప్ పెట్టాలని ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నామన్నారు. గ్రూప్ 1 పరీక్షలు కచ్చితంగా నిర్వహిస్తామన్నారు. కొంతమంది ఉద్యోగాలు పోవడంతో వాళ్లు ఆందోళన చేస్తున్నారని సీఎం వెల్లడించారు.
ఈ నెల 22-23 వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న అమరావతి డ్రోన్ సమ్మిట్-2024కు ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. రెండు రోజుల సదస్సు సరిగే మంగళగిరి సీకే కన్వెన్షన్‌లోనూ, ఇటు 22వ తేదీ సాయంత్రం విజయవాడ కృష్ణానది తీరాన ఉన్న పున్నమీ ఘాట్ వద్ద మెగా డ్రోన్ షో నిర్వహణకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి.
కడప జిల్లా బద్వేల్ సమీపంలో ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఇంటర్ విద్యార్థినిని రోడ్డుపక్కనే చెట్లలోకి తీసుకెళ్లి విఘ్నేష్ అనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ కేసులో పోలీసులు బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు.