5 నెలల చంద్రబాబు పాలనలో డీబీటీ ఎక్కడ మచ్చుకైనా కనపడటం లేదని.. డీపీటీ మాత్రమే కనిపిస్తోందని.. డీపీటీ పాలన అంటే దోచుకో పంచుకో తినుకో మాత్రమే చంద్రబాబు పాలనలో ఉందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. సూపర్ సిక్స్ లేదు సూపర్ 7 కూడా లేదన్నారు. ప్రజలు నిలదీస్తారని భయపడి కనీసం బడ్జెట్ పెట్టలేని అసమర్థ ప్రభుత్వం ఇదేనంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. దేశంలో ఈ విధానం ఓటాన్ బడ్జెట్ నడుపుతున్న ప్రభుత్వం ఇదేనన్నారు.
వైసీపీ చేయని తప్పులు లేవని.. లేకుంటే ఎందుకు ఎన్నికల్లో 11కు పడిపోయారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మనం నిలబడ్డాం నిలదొక్కుకున్నామని.. 93 శాతం సీట్లు వచ్చాయంటే... అందరం గుర్తు పెట్టుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం టీడీపీ ప్రజాప్రతినిధులకు సూచనలు చేశారు. విదేశాల నుంచీ వచ్చి మరీ మనల్ని గెలిపించారన్నారు.
ప్రజలకు విక్రయించే సరుకులు నాణ్యత, ధరలపై విజయవాడలోని పడమట రైతుబజార్, గురునానక్ కాలనీ నందు ఉషోదయ సూపర్ మార్కెట్‌ను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ధరల స్థిరీకరణ విషయంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని రైతు బజార్లు, సంస్థాగత రిటైల్ దుకాణాలలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే నాణ్యమైన సరకులను వినియోగదారులకు అందించాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలోని పట్టణాలను అందంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికను రూపొందించిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలతో పాటు వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
ఏపీలో రూ.99 క్వార్టర్ మద్యం బాటిళ్లు అందుబాటులోకి రానున్నాయని ఏపీ ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్ వెల్లడించారు. సోమవారం నాటికి 20,000 కేసుల మద్యం బాటిళ్లు చేరుకోనున్నాయని ఆయన తెలిపారు. ఈ నెలలో కోటి ఇరవై లక్షల క్వార్టర్ సీసాల మద్యం సిద్ధమైందని వెల్లడించారు.
వాతావరణ శాఖ సూచనల ప్రకారం మధ్య బంగాళాఖాతంలో అక్టోబర్ 22న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రానున్న నాలుగు రోజులు వాతావరణం క్రింద విధంగా ఉండనున్నట్లు విపత్తుల సంస్థ ఎండీ కూర్మనాథ్ వివరించారు.
ప్రభుత్వ సర్వజనాసుపత్రుల నిర్వహణ, సేవల్ని మెరుగుపర్చి వీటి పట్ల ప్రజల్లో సానుకూల అభిప్రాయాన్ని కలిగించేందుకు రెండు నెలల క్రితం రూపొందించిన 30 అంశాలతో కూడిన కార్యాచరణ ప్రణాళిక అమలుపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ సచివాలయంలో సుదీర్ఘంగా సమీక్షించారు. మూడు గంటల పాటు సాగిన సమీక్షలో అంశాల వారీగా జీజీహెచ్‌లలో చేపట్టబడిన చర్యలపై వివరాల్ని మంత్రి అడిగి తెలుసుకున్నారు.
ఏపీలో పెట్టుబడులపై ఈ నెల 25 నుంచి మంత్రి నారా లోకేశ్ అమెరికాలో పర్యటించనున్నారు. నవంబర్ ఒకటో తేదీ వరకు శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో లోకేశ్ పర్యటించనున్నారు. ఈ నెల 25 తేదీన అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగే ఐటీ సినర్జీ కాన్పరెన్సుకు మంత్రి హాజరు కానున్నారు.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసును అడ్డుపెట్టుకొని వైసీపీ నాయకులను వేధిస్తున్నారని, తప్పుడు కేసులు పెడుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు.