DGP Dwaraka Tirumala Rao: అక్టోబర్ 21న సంస్మరణ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహిస్తున్నామని.. ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఏపీ డీజీపీ ద్వారక తిరుమల రావు పేర్కొన్నారు. అక్టోబర్ 21 నుండి 31 వరకు పదిరోజులు సంస్మరణ దినోత్సవాలు జరుపుతున్నామని ఆయన తెలిపారు. 31న జాతీయ ఐక్యత దినం వరకు జరుపుతామన్నారు. 21న అమరులకు నివాళులు అర్పిస్తామని, దేశంలో అమరులైన అందరి పేర్లు చదువుతామన్నారు. అమరుల కుటుంబాలను సీనియర్లు అధికారులతో పరామర్శించే కార్యక్రమం ఉంటుందన్నారు. స్కూల్స్‌లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఓపెన్ హౌస్ కార్యక్రమం చేపడతామన్నారు.
Read Also: YS Jagan: నెల రోజుల్లో ఇసుకను దోచేశారు.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
వ్యాసరచన, వకృత్వం పోటీల నిర్వహణ ఉంటుందన్నారు. రక్త దాన శిబిరాలు, మెడికల్ క్యాంపులు చేపడతామని డీజీపీ వెల్లడించారు. పోలీసు ఆరోగ్య భద్రత సంక్షేమం కార్యక్రమం 1999లో ప్రారంభం అయిందన్నారు. ఒక్కరికోసం అందరూ అందరికోసం ఒక్కరూ అనే స్ఫూర్తితో ప్రతి నెల కొంత సాయం చేయడం ద్వారా చేపడుతున్నామన్నారు. రుణాలు అందించే ఏర్పాటు చేస్తామన్నారు. బీమా, ఎక్స్‌గ్రేషియా అందించే ఏర్పాటు చేస్తామన్నారు. నిలిచిపోయిన గ్రూప్ ఇన్సూరెన్స్‌ను పునరుద్ధరించడం జరిగిందన్నారు. ఫ్లాగ్ ఫండ్‌ను విద్యార్థుల స్కాలర్ షిప్ అందిస్తున్నామన్నారు. సర్వీస్ హోంగార్డ్ మరణిస్తే ఎక్స్‌గ్రేషియా అందిస్తామని డీజీపీ తెలిపారు.