Child Marriage: రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలికను మధ్యవయస్కుడైన వ్యక్తికి ఇచ్చి వివాహం చేసేందుకు రూ.4.50 లక్షలకు ఆ చిన్నారి విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు. భూపాల్ సింగ్ (38) కుటుంబం రూ.4.50 లక్షలు చెల్లించి బాలికను ఆమె తండ్రి నుంచి కొనుగోలు చేసింది. నివేదికల ప్రకారం, భూపాల్ సింగ్ ఆ అమ్మాయిని మే 21న వివాహం చేసుకున్నాడు. ధోల్‌పూర్ జిల్లాలోని మానియా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్‌లో హత్య కేసులో జైలు శిక్ష అనుభవించిన తర్వాత అనుమానితుడి కుటుంబం గ్రామంలో స్థిరపడినట్లు విచారణలో తేలింది.
Read Also: Amit Shah: కొత్త పార్లమెంట్ భవనంలో చారిత్రక రాజదండం ‘సెంగోల్’
బాలికను మధ్యవయస్కుడైన వ్యక్తికి కొనుగోలు చేసి వివాహం చేసినట్లు మంగళవారం సమాచారం అందిందని పోలీసు సూపరింటెండెంట్ (ధోల్పూర్) మనోజ్ కుమార్ తెలిపారు. మానియా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దీపక్ ఖండేల్వాల్ నేతృత్వంలోని బృందం భూపాల్ సింగ్ ఇంటిపై దాడి చేసింది. అక్కడ నుంచి బాలికను స్వాధీనం చేసుకున్నారు. ఆమె చేతులపై హెన్నాతో రాసుకుని ఉంది. అంటే పెళ్లి ఇటీవలే జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె తండ్రికి రూ.4.50 లక్షలు చెల్లించి బాలికను కొనుగోలు చేసినట్లు భూపాల్ సింగ్ కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఈ ఘటనలో ఎవరెవరకి ప్రమేయం ఉందనే దానిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని, సమాచారం సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.