2024 సార్వత్రిక ఎన్నికలకు ఉమ్మడి వ్యూహంపై చర్చించేందుకు ప్రతిపక్షాలు జూన్ 12న పాట్నాలో సమావేశం కానున్నాయి. 18కి పైగా భావసారూప్యత కలిగిన ప్రతిపక్ష పార్టీలు ఈ సదస్సుకు హాజరు కానున్నాయి.
చిన్నపిల్లలు తమకు ఇష్టమైన పదార్థాలను చాలా ఎక్కువగా తింటుంటారు. కొన్ని ఆహార పదార్థాల వల్ల అనర్థం వాటిల్లుతుందని తెలియక అనారోగ్యానికి గురవుతుంటారు. అమెరికాలోని ఓ 5 ఏళ్ల బాలుడు ఇంట్లో పేరెంట్స్ తెచ్చిపెట్టుకున్న షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్స్ ప్యాకెట్ జేబులో పెట్టుకున్నాడు.
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అస్సాంలో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించనున్నారని ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
అగ్రరాజ్యం అమెరికా దివాళా అంచున కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు అప్పులు పెరిగిపోయి.. మరోవైపు కొత్త అప్పులు తీసుకునే అవకాశం లేక బైడెన్ సర్కార్ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇప్పటికే అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ యెలెన్ చేతులెత్తేశారు. జూన్ 1 వరకు కాంగ్రెస్ అప్పుల పరిమితి పెంచకపోతే.. దివాళా తీయడం ఖాయమని తేల్చి చెప్పారు. దివాళా అంచు వరకు వచ్చాక.. బైడెన్ సర్కార్‌కు కాస్త ఊరట లభించింది.
మెక్సికోలో కాస్మెటిక్ సర్జరీలతో సంబంధం ఉన్న ఫంగల్ మెనింజైటిస్ వ్యాప్తిపై ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని అమెరికా, మెక్సికోలోని అధికారులు ప్రపంచ ఆరోగ్య సంస్థకి విజ్ఞప్తి చేసింది.
మణిపూర్‌లో అల్లర్లు రేగిన అనేక ప్రాంతాల్లో పోలీసు కమాండోలు ఎనిమిది గంటలకు పైగా ఆపరేషన్ నిర్వహించి సుమారు 40 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు తమకు నివేదికలు అందాయని ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఈరోజు మీడియాతో తెలిపారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. 2024 లోక్‌సభ ఎన్నికలపై విస్తృత చర్చలు జరిగాయి. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ/ఎన్‌డీఏ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాల్లోని గత మూడు నెలల నివేదిక కార్డును అందజేస్తారని, దానిపై చర్చ జరిగిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ మల్లయోధులు చేపట్టిన ఆందోళన ఆదివారం ఉద్రిక్తతలకు దారితీసింది. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న మల్లయోధులు, వివిధ రాష్ట్రాల ఖాప్ పంచాయతీలు, రైతులు ఆదివారం పార్లమెంటు భవనం సమీపంలో 'మహిళా సమ్మన్ మహాపంచాయత్'కు పిలుపునిచ్చారు.
కొత్తగా నియమితులైన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ప్రధాన కార్యదర్శి ఒమర్ అయూబ్ ఖాన్ ఆదివారం ఇస్లామాబాద్ పోలీసులు తన ఇంటిపై దాడి చేసి తన వాహనాన్ని దొంగిలించారని ఆరోపించారు. దొంగలను పట్టుకోవడానికి దొంగలను ఎలా పిలవాలి అని ఎద్దేవా చేశారు.