Amit Shah at Imphal : మణిపూర్‌లో శాంతి వాతావరణం నెలకొల్పడానికి స్వయంగా రంగంలోకి దిగిన కేంద్ర హోం శాఖ మంత్రే అమిత్ షా మంగళవారం రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో మహిళలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారితో సమావేశం అనంతరం శాంతి చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నాలుగు రోజుల పర్యటన కోసం మణిపూర్ వచ్చిన హోం మంత్రి సోమవారం రాష్ట్ర గవర్నర్ అనుసూయా ఊకేయితోపాటు ముఖ్యమంత్రి ఎన్ బైరేన్ సింగ్‌తో సమావేశమయ్యారు. రాష్ర్టంలో ప్రస్తుత పరిస్థితులపై వారితో చర్చించారు. మంగళవారం మహిళా సంఘాలతో సమావేశం అనంతరం రెండు వర్గాలతోనూ శాంతి చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు సమాచారం. జూన్ 1 వరకు హోం మంత్రి మణిపూర్‌లోనే ఉండనున్నారు.
Read Also: Manish Sisodia: మనీష్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరణ..
మెయిటీ– కుకీ తెగల మధ్య ఘర్షణలతో మణిపూర్‌లో మే 3వ తేదీ నుంచి అశాంతి నెలకొంది. అప్పటినుంచి మణిపూర్‌లో ఇంటర్నెట్ బంద్ చేశారు. 34 వేల మంది కేంద్ర భద్రతా దళాలను రాష్ట్రంలో మోహరించారు. వాస్తవానికి మణిపూర్‌కు చెందిన 25పైగా కుకీ తిరుగుబాటు వర్గాలతో కేంద్ర ప్రభుత్వం–రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలం కిందట త్రైపాక్షిక శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనిప్రకారం తిరుగుబాటుదారులు ప్రభుత్వం నిర్దేశించిన శిబిరాలకు పరిమితం కావాలి. ఆయుధాలను పక్కనపెట్టాలి. కానీ, మెయిటీలు ఎస్టీ హోదా డిమాండ్ చేస్తుండడం.. గువాహటి హైకోర్టు దానికి మద్దతుగా తీర్పు ఇవ్వడంతో.. కుకీలు మళ్లీ ఆయుధాలు చేతబట్టడంతో ఘర్షణలు మొదలై ఏకంగా కేంద్ర హోం మంత్రే స్వయంగా వచ్చి శాంతి భద్రతలు చక్కదిద్దాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.