Hollywood Al Pacino : 82 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న అల్ పాసినో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hollywood Al Pacino : హాలీవుడ్ సీనియర్ నటుడు, గాడ్‌ఫాదర్ చిత్రాలతో అభిమానులను అలరించిన అల్ పాసినో 82 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్నారు. ఆల్ పాసినో నాలుగోసారి తండ్రి కాబోతున్నారు. 82 ఏళ్ల అల్ పాసినో.. 29 ఏళ్ల యువతి నూర్ అల్ఫల్లాతో కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ప్రస్తుతం నూర్ అల్ఫల్లా గర్భం దాల్చింది. ఈ విషయాన్ని అల్ పాసినో ప్రతినిధి ఓ మ్యాగజైన్‌కు వెల్లడించారు. నిర్మాతగా కొనసాగుతున్న నూర్‌తో పాసినోకు కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అనంతరం వారు రిలేషన్‌షిప్‌లో కొనసాగుతున్నారు.
Read Also: Elon Musk: మస్క్ ఈజ్ బ్యాక్.. మళ్లీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు
Also Read
మాజీ ప్రియురాలు మీటల్ దోహన్‌తో బ్రేకప్ అయిన వెంటనే అల్ఫాల్లాతో పాసినో డేటింగ్ ప్రారంభించినట్టు నమ్ముతారు. గతేడాది ఏప్రిల్‌లో ఈ జంట కాలిఫోర్నియాలోని వెనిస్‌లోని ఫెలిక్స్ రెస్టారెంట్‌లో జంటగా కనిపించడంతో డేటింగ్ ఊహాగానాలు మొదలయ్యాయి. గత నెలలో పాసినో స్నేహితుడు బెన్నెట్ మిల్లర్ నిర్వహించిన ఎగ్జిబిషన్‌కు ఇద్దరూ హాజరయ్యారు. పాసినోతో డేటింగ్‌కు ముందు రోలింగ్ స్టోన్స్ సింగర్ మిక్ జాగర్‌తో అల్ఫల్లా డేటింగ్‌లో ఉంది. ఏడాదికిపైగా సాగిన ఆ బంధానికి 2018లో ముగింపు పలికారు. తర్వాత 2019లో నటుడు, దర్శకుడు క్లింట్ ఈస్ట్‌ఉడ్‌తో కలిసి ఆమె చెట్టపట్టాలేసుకుని తిరిగినా.. తమ మధ్య అలాంటిదేమీ లేదని చెప్పింది. అల్ఫల్లాకు మొదటి సంతానం కాగా.. పాసినో నాలుగో సారి తండ్రవుతున్నాడు. అల్ పాసినోకు ఇప్పటికే ముగ్గురు సంతానం. నటన శిక్షకురాలు జాన్ టరంట్‌తో కుమార్తె జూలీ మేరీ (33), మాజీ ప్రియురాలు బెవెర్లీ డీఆంగెలోతో 22 ఏళ్ల కవలలు ఉన్నారు. రెండేళ్ల వయసులోనే తనను, తన తల్లిని విడిచిపెట్టిన తన తండ్రిలా ఉండకూడదనుకుని తన పిల్లలతో సన్నిహితంగా మెలగాలని భావిస్తానని పాసినో పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు