Gold Price : బంగారం అంటే అందరికీ మక్కువే. ఆడవాళ్లకే కాకుండా.. మగవాళ్లు కూడా వంటిపై ధరిస్తారు కాబట్టి .. బంగారం ధరలపై ప్రజలు నిత్యం ఒక కన్నేసి ఉంటారు. బంగారం ధరలు తగ్గాయంటే కొనడం కోసం చూస్తుంటారు. పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ధరలు తగ్గాయంటే ప్రజలు పండగ చేసుకోకుండా ఉంటారా? ఈ రోజు పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో గోల్డ్ రేట్లు దిగివస్తుండడం భారీగా ఊరట కలిగిస్తోంది. దేశీయంగా డిమాండ్ పెరుగుతున్న తరుణంలో ధరలు దిగి వస్తుండడం బంగారం కొనుగోలు చేసే వారికి మంచి అవకాశంగా మారుతోంది. దేశంలో కొద్ది రోజుల క్రితం రూ.2000 నోట్లు ఉపసంహరణ ప్రకటనతో బంగారం కొంటున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో పసిడి ధరలు భారీగా పెరుగుతాయని అంతా భావించారు. కానీ, అందుకు విరుద్ధంగా గోల్డ్ రేట్లు పడిపోతున్నాయి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో ఇవాళ గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అంతర్జాతీయ మార్కెట్ల బంగారం, వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. అమెరికా జీడీపీ గణాంకాలు అంచనాలకు మించి నమోదవడం సహా ఇతర కారణాలు ఇందుకు దోహదపడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఒక ఔన్సుకు 1976.30 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 23.86 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇండియన్ రూపాయి కరెన్సీ విలువ డాలర్‌తో పోలిస్తే అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ రూ.82.313 వద్ద స్థిరంగా ఉంది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్ల బంగారం ధరలు ఇవాళ మళ్లీ తగ్గాయి. 22 క్యారెట్ల గోల్డ్ రేటు ఇవాళ 10 గ్రాములకు రూ.150 పడిపోయింది. ప్రస్తుతం తులం రేటు రూ.55,700 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు 10 గ్రాములకు రూ.170 పడిపోయి రూ.60,760 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్లో చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.150 తగ్గి ప్రస్తుతం రూ.55,850 కొనుసాగుతుండగా. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు 150 దిగివచ్చింది. ప్రస్తుతం తులానికి రూ.60,930 వద్ద కొనసాగుతోంది.
Read Also: Tamilnadu : వేలూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం..
వెండి ధరలు..
ఇక వెండి విషయానికి వస్తే ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. బంగారం పడిపోతుంటే వెండి మాత్రం పుంజుకోవడం విశేషం. ప్రస్తుతం హైదరాబాద్ మహా నగరంలో కిలో వెండి రేటు ఇవాళ రూ.800 మేర పెరిగింది. ప్రస్తుత కిలో వెండి రూ. 77,600 పలుకుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే కిలో వెండి రేటులో ఎలాంటి మార్పు లేదు. స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఢిల్లీలో కిలో వెండి రేటు రూ.72,800 వద్ద ట్రేడవుతోంది. ఢిల్లీతో పోలిస్తే మన హైదరాబాద్‌లో గోల్డ్, సిల్వర్ రేట్లలో భారీ వ్యత్యాసం ఉంటుంది. బంగారం ధర కాస్త తక్కువగా ఉండగా.. వెండి ధర మాత్రం కాస్త ఎక్కువగా ఉంది. స్థానిక ట్యాక్సుల నేపథ్యంలో ఈ వ్యత్యాసం ఉంటుందని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు.