America President Joe Biden : అగ్ర రాజ్యానికి అధిపతి అయినా ఆయన తన చేష్టలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు. అతనెవరో కాదు అమెరికా అధ్యక్షులు జో బైడెన్. ఉన్నట్టుండి మరచిపోవడం.. ఒకవైపు వెళ్లాల్సి ఉండి మరోవైపు వెళుతుండటం.. ఉన్నట్టుండి కిందపడిపోవడం ఇటువంటి చేష్టలతో ఆయన సోషల్ మీడియాలో ఉంటారు. గురువారం ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో మిలిటరీ గ్రాడ్యుయేట్స్ కార్యక్రమంలో పాల్గొన్న జో బైడెన్ నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ముందుకు పడిపోయారు.కొలరాడోలోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఏర్పాటు చేసిన మిలటరీ గ్రాడ్యుయేట్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రారంభ ప్రసంగం ముగిసన అనంతరం క్యాడెట్స్ తో కరచాలనం చేసిన తరువాత నడుచుకుంటూ ముందుకు వెళుతున్న సందర్భంలో ఒక్కసారి తుళ్లి కిందపడ్డారు. వెంటనే తేరుకున్న సెక్యూరిటీ సిబ్బంది అధ్యక్షున్ని పైకి లేపి అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు.
Read Also: Maharashtra: ఏక్ నాథ్ షిండేతో శరద్ పవార్ భేటీ..
బైడెన్‌కు ఎలాంటి గాయాలు కాలేదని .. క్షేమంగానే ఉన్నారని.. క్యాడేట్స్ తో కరచాలనం చేసి వస్తున్న క్రమంలో ఇసుక బస్తా ఉండటంతో తగిలి కింద పడ్డారని వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ బెన్ లాబోల్ట్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఎయిర్‌ఫోర్స్ వన్ మరియు మెరైన్ వన్ ద్వారా వైట్‌హౌజ్‌కి వచ్చిన తరువాత హెలీకాప్టర్ నుంచి దిగుతున్న సమయంలో తన తల డోర్‌కు తగిలింది. తరువాత జో బైడెన్ సౌత్‌లాన్ మీదుగా నడుస్తూ విలేకరుల సమావేశానికి వెళ్లారు. అక్కడ తాను ఇసుకబ్యాగ్ మూలంగా కిందపడ్డానని విలేకరులతో చమత్కరించారు. ప్రెసిడెన్సీలో అత్యధిక వయస్సున్న అధ్యక్షులు జో బైడెన్. బైడెన్‌కు ప్రస్తుతం 80 ఏళ్లు. ఈ వయస్సులో తిరిగి 2024 ఎన్నికలలో రెండవసారి పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ సంవత్సరం అతని అధికారిక వైద్యుని నివేదిక ఆధారంగా అతను శారీరకంగా దృఢంగా ఉన్నారని.. అతను క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నట్టు ప్రకటించారు. గతంలో నవంబర్ 2020లో అపుడు అధికారంలో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌పై ఎన్నికల్లో గెలిచిన కొద్దిసేపటికే బైడెన్ తన పెంపుడు కుక్కతో ఆడుకుంటూ జారీ పడటంతో కాలు విరిగింది.