Nomophobia : నోమోఫోబియా.. ప్రతి నలుగురిలో ముగ్గురికి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nomophobia : ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి దగ్గర కనిపించే ఏకైక వస్తువు మొబైల్ ఫోన్. ఇది లేకుండా ఉండే మనిషి లేడంటే ఆశ్యర్యమే! ఇక ప్రతి రోజూ లేవగానే తన మొఖం తాను చూసుకోవడం కంటే ముందే తన మొబైల్ ఫోన్ ఎక్కడుందా? అని వెతుక్కుంటారు. మొబైల్ ఫోన్ వాడకానికి వయస్సుతో సంబంధం లేదు. చిన్న పిల్లల నుంచి పండు ముదుసలి వరకు మొబైల్ ఫోన్‌ను వినియోగిస్తున్నారు. వైద్య వృత్తిలో ఉండే వైద్యులు ఆపరేషన్ సమయంలో.. వాహానాలను నడిపే సమయంలో డ్రైవర్లు.. పాఠాలు బోధించే సమయంలో ఉపాధ్యాయులు.. చివరికి వ్యవసాయం చేసే రైతు సైతం తన పనుల్లో ఉంటూనే ఫోన్లను ఉపయోగిస్తున్నారు. అంతటి విడదీయరాని బంధం మనిషికి ఫోన్‌తో ఏర్పడింది. మనిషి నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి తిరిగి పడుకొనే వరకు ఫోన్ వాడుతూనే ఉంటాడు. చివరికి పడుకున్న తరువాత ఏదైనా మెసేజ్ వచ్చిందేమోనని తిరిగి చూసుకునే వ్యక్తులు కూడా ఉంటారు. ఇంత ఇదిగా మొబైల్‌లో మనిషికి అటాచ్‌మెంట్ ఉంది.
ఒక్క నిమిషం తన మొబైల్ ఫోన్ కనబడకపోతే.. మనిషి ఎంతో టెన్షన్‌కు గురవుతాడు. కంగారు పడిపోతాడు. ఫోన్ లేకపోతే ఏదో తెలియని వెళితి.. ఇక తాను ఏమీ చేయలేననే నిరూత్సాహం.. నిస్సత్తువ మనుషుల్లో ఆవహిస్తుంది. ఒక్క క్షణం ఫోన్ కనిపించకపోతే మనసులో తెలియని గుబులు. ఒక్క క్షణం ఫోన్ కనిపించకపోతే కావాల్సినవాళ్లు దూరమైనంత కంగారు.. మొబైల్ సిగ్నల్ పోతే మనసులో తెలియని గుబులు.. మొబైల్‌లో లో- బ్యాటరీ అని అలర్ట్ వస్తే ప్రాణాలు పోతున్నాయన్నంత ఆందోళన వస్తుంటుంది. ఇది చాలా మందికి కలిగే ఆందోళన. ఇలాంటి ఫీలింగ్‌ను మనలో చాలామంది ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొనే ఉంటాం. ఇటువంటి దుస్థితిని మీరే కాదు ప్రతి నలుగురిలో ముగ్గురు ఎదుర్కొంటున్నారని.. దీనిపేరే నోమోఫోబియా అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Also Read
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
మొబైల్‌కు ఎక్కడ దూరంగా ఉండాల్సి వస్తుందేమోనన్న భయాన్నే నోమోఫోబియా అని పిలుస్తారు. నో( NO ) మొబైల్ ( MO ) ఫోన్ ( PHO) ఫోబియా (BIA) అనే పరిస్థితి నుంచే నోమోఫోబియా(NOMOPHOBIA) అనేది వచ్చిందంటున్నారు. ఇదొరకమైన మానసిక సమస్యగా చెప్పొచ్చు. ఇటువంటి సమస్య ప్రతి నలుగురిలో ముగ్గురికి ఉంటుందని అధ్యయనంలో బయటపడింది. నోమోఫోబియాను మొట్టమొదటిసారి 2008లో యూకేలో గుర్తించారు. యూకే రీసెర్చ్ ఏజెన్సీకి చెందిన యూగవర్నమెంట్ 2163 మందిపై నిర్వహించిన సర్వేలో దీని గురించి ప్రస్తావించారు. సర్వేలో 53 శాతం మంది నోమోఫోబియా లక్షణాలతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. అప్పటికీ ఇప్పటికీ నోమోఫోబియాతో బాధపడేవాళ్ల సంఖ్య కూడా భారీగా పెరుగుతూనే ఉంది. ప్రతి నలుగురిలో ముగ్గురు సెల్‌ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారని ఒప్పో ఇండియా, కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నిర్వహించిన తాజా అధ్యయనంలో కూడా వెల్లడైంది.
Read Also: Hyderabad: హెచ్‌క్యూ బోస్టన్ తర్వాత స్టేట్‌స్ట్రీట్.. రెండవ అతిపెద్ద సైట్‌గా హైదరాబాద్
నోమోఫోబియాకు కారణాలు..
ఒకప్పుడు మొబైల్‌ను కేవలం మాట్లాడుకోవడానికి(కాల్స్) మాత్రమే ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు ప్రతి పనిలోనూ స్మార్ట్‌ఫోన్ భాగమైపోయింది. ఏ చిన్న పనికి అయినా సరే మొబైల్ తప్పనిసరి అన్నట్లుగా మారింది. దీనికితోడు గేమ్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో చాలామంది ఫోన్లకు అతుక్కుపోతున్నారు. దానికి బానిసగా మారిపోతున్నారు. అందుకే ఫోన్‌ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారు. ఫోన్ దూరమైతే తమ శరీరంలో ఒక అవయవాన్ని కోల్పోయినట్లుగా కంగారు పడిపోతున్నారు.
నోమోఫోబియా లక్షణాలు..
నోమోఫొబియా లక్షణాలు ఉన్నాయో లేదో సులువుగానే గుర్తించవచ్చంటున్నారు నిపుణులు. ఫోన్‌ను కొద్దిసేపు ఆఫ్ చేయడానికి కూడా ఇబ్బంది పడటం.. ఒకవేళ పక్కనబెట్టినా లేదా జేబులో పెట్టుకున్నా సరే మిస్‌డ్‌కాల్స్, మెసేజెస్ ఏమైనా వచ్చాయా? అని మాటిమాటికి ఫోన్ తీసుకుని చూసుకోవడం.. నెట్‌వర్క్ లేకపోయినా, ఇంటర్నెట్ కనెక్షన్ పోయినా కంగారుపడిపోవడం.. బయటకు వెళ్లినప్పుడు ఫోన్ ఎక్కడ స్విచ్ఛాఫ్ అయిపోతుందో అని ఆందోళన చెందడం.. బ్యాటరీ ఒక్క పాయింట్ తగ్గినా టెన్షన్ పడిపోయి ఛార్జింగ్ పెట్టడం.. వీటిలో ఏ సమస్య అనిపించినా భావోద్వేగానికి గురికావడం.. కంగారు పడటం ఇవన్నీ కూడా నోమోఫోబియా లక్షణాలుగానే నిపుణులు చెబుతున్నారు. నోమోఫోబియా ఉన్నవారు ఎప్పుడూ విచారంగా ఉండటం, ఎవరినో కోల్పోయినట్లుగా నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు అనిపించడం, అభద్రతాభావం ఇతర పనుల మీద ఫోకస్ చేయలేకపోవడం ఇవన్నీ కూడా నోమోఫోబియా లక్షణాలే.
బయటపడాలంటే..
గంటలకొద్దీ మొబైల్ ఫోన్‌ను వినియోగించకుండా స్వీయ నియంత్రణ పెట్టుకోవాలి. రోజు ఆఫీసుకు లేదా కాలేజీకి వెళ్లి ఒక్కరోజు సెలవు ఎలా తీసుకుంటున్నారో.. అలాగే మొబైల్ ఫోన్‌కు కూడా ఒకరోజు సెలవు ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. వారంలో ఒకరోజు మొబైల్‌ను పక్కనపడేసి ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపేలా ప్లాన్ చేసుకోవాలి. ఇతరత్రా కార్యకలాపాలపై దృష్టిసారించాలి. మానసిక ఆందోళనను తగ్గించుకోవడానికి యోగా, వ్యాయామం చేయాలి. వీటి వలన మనసుకు ప్రశాంతత లభిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!