Crime News: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పసివేదల గ్రామంలో దారుణ హత్య జరిగింది. ఆర్థిక వ్యవహారాల విషయంలో అత్తమామలతో ఘర్షణకు దిగిన అల్లుడు ఆగ్రహంతో వారిపై దాడి చేశాడు. ఐదు కేజీల గ్యాస్ బండతో అత్తమామలను కొట్టడంతో మామ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. తీవ్ర గాయాల పాలైన అత్తను స్థానికుల సహాయంతో 108లో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
Read Also: Sudan : సూడాన్‌లో ఆకలితో 60 మంది చిన్నారులు మృతి
బాధితులు, అత్తామామలైన బేబీ(61), రాయoకుల శ్రీ రామకృష్ణ (62)లు.. దొమ్మేరు సావరానికి చెందిన అల్లుడు నందిగం గోపి(42)కి మధ్య ఆర్థిక వ్యవహారాల విషయంలో వివాదం చెలరేగడంతో ఈ దారుణం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఆవేశంతో గోపి వారిపై గ్యాస్ బండతో దాడికి పాల్పడినట్లు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. అత్తామామలను ఎందుకు చంపాడనే వివరాలపై ఆరా తీస్తున్నారు.