Odisha Train Accident: 230 దాటిన మృతులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha Train Accident: ఒడిశాలో రైలుపట్టాలపై మరణ మృదంగం మోగింది. శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 233కి చేరింది. మరో 900 మందికిపైగా గాయపడగా.. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. రాత్రివేళ ప్రమాదం చోటుచేసుకోవడంతో.. బోల్తాపడిన బోగీల్లో చాలా మంది ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇటీవలి కాలంలో దేశంలో చోటుచేసుకున్న అతిపెద్ద రైలుప్రమాదం ఇదేనని భావిస్తున్నారు. బాధితుల్లో బెంగాల్‌వాసులే ఎక్కువమంది ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: AP CM Jagan: ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ప్రమాద ఘటనపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. స్థానిక రైల్వే అధికారులు ఒకలా.. రైల్వే అధికార ప్రతినిధి మరొలా చెబుతున్నారు. తొలుత బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న యశ్వంతపూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ బాలేశ్వర్ సమీపంలోని బహానగా బజార్ వద్ద శుక్రవారం రాత్రి దాదాపు 7 గంటల సమయంలో తొలుత పట్టాలు తప్పిందని.. దీంతో పలు బోగీలు పక్కనే ఉన్న పట్టాలపై పడ్డాయని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలో వచ్చిన షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ వాటిని ఢీకొట్టింది. దాంతో కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 15 బోగీలు బోల్తాపడ్డాయి. అనంతరం కోరమండల్ కోచ్‌లను పక్కనున్న ట్రాక్‌పై వస్తోన్న గూడ్సు రైలు ఢీకొంది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం తీవ్రత భారీగా పెరిగింది. అయితే రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ మాత్రం దీనికి భిన్నమైన ప్రకటన చేశారు. తొలుత కోరమండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిందని.. దాని బోగీలు బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ రైలు పట్టాల మార్గంలో పడ్డాయని పేర్కొన్నారు. అనంతరం ఆ సూపర్‌ఫాస్ట్ బోగీలు పక్క ట్రాక్‌పై బోల్తాపడ్డాయని తెలిపారు. ప్రమాదం తర్వాత బోగీల్లో చిక్కుకున్న బాధితుల హాహాకారాలతో ఘటనాస్థలం దద్దరిల్లింది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన అధికారులు.. తక్షణమే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. బాలేశ్వర్‌లోని వివిధ ఆసుపత్రుల్లో 400 మంది క్షతగాత్రులను అధికారులు చేర్పించారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ సహా బాలేశ్వర్, భద్రక్, మయూర్‌బంజ్, కటక్‌ల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను అలర్ట్ చేశారు. బోల్తాపడ్డ బోగీల నుంచి ఇప్పటివరకు 120 మృతదేహాలను బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఘటనా స్థలానికి 200 అంబులెన్స్‌లతోపాటు అవసరం ఉన్న మేరకు వైద్యులను ఒడిశా ప్రభుత్వం పంపించింది.
Read Also: Kavach Technology : రైలు ప్రమాదాల నివారణకు కోట్లు ఖర్చు పెట్టి తెచ్చిన కవాచ్ వ్యవస్థ ఏమైంది?
ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని విచారం
రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌లు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రైల్వే శాఖ రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ప్రమాదానికి సంఘీభావంగా ఒడిశా ప్రభుత్వం శనివారం సంతాప దినంగా పాటించాలని నిర్ణయించింది. శనివారం జరిగే ఒడిశా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రభుత్వం రద్దుచేయడంతోపాటు.. అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేసింది. : రైలు ప్రమాదంపై రైల్వే శాఖ ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. ప్రమాద స్థలాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. ప్రమాద కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను ఆయన పర్యవేక్షించారు. “రైలు ప్రమాద ఘటన చాలా బాధాకరం.. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం.. దర్యాప్తు హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేశాం.. ప్రస్తుతం సహాయక చర్యల మీదే ఫోకస్ పెట్టాం.. విచారణ తర్వాతే ప్రమాదానికి కారణాలు చెప్పగలం.” అని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో పాటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు.
తాజావార్తలు
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!