కర్ణాటకలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఉప ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఉప ఎన్నికలు జూన్ 30న జరుగుతాయని తెలిపింది.
ఒడిశాలో మూడు రైళ్ల ప్రమాద ఘటనను మరువకముందే మరో ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. సీల్దా-అజ్మీర్ ఎక్స్‌ప్రెస్ రైలు జనరల్ కోచ్‌లలో ఒకదానిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.
తరాలు మారినా మానుషుల్లో మార్పు ఇసుమంతైనా లేదు. ఇంకా కులమతాలు పట్టుకుని వేలాడుతున్నారు. దేశంలో నలుమూలలా ఇంకా కులవివక్ష కోరలు విప్పి బుసలు కొడుతూనే ఉంది.
ఎయిరిండియాకు చెందిన విమానం రష్యాలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఆ విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది.
రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి నేపాల్, భారతదేశం అధికారులు చర్చలకు కూర్చోవాలని నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ సోమవారం అన్నారు.ప్రచండ మే 31 నుంచి జూన్ 3 వరకు భారతదేశాన్ని సందర్శించారు.
ఆదివారం భాగల్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడానికి బీజేపీనే కారణమని బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోపించారు. "బీజేపీ వంతెన కూలిపోవడానికి కారణమైంది. మేము వంతెనలను నిర్మిస్తాము.. బీజేపీ వాటిని నాశనం చేస్తూనే ఉంది" అని తేజ్ ప్రతాప్ యాదవ్ అన్నారు.
డార్క్‌నెట్, క్రిప్టోకరెన్సీని ఉపయోగించిన పాన్-ఇండియా డ్రగ్ నెట్‌వర్క్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఛేదించింది. 15 వేల ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ను ఎన్సీబీ సీజ్ చేసింది. ఈ వ్యవహరంలో ఆరుగురిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది.
దాయాది దేశమైన పాక్ అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వ మొత్తం అప్పులు ఏడాది ప్రాతిపదికన 34.1 శాతం పెరిగి ఏప్రిల్ చివరి నాటికి రూ. 58.6 ట్రిలియన్‌లకు చేరుకున్నాయని ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ తాజా నివేదిక తెలిపింది.
ఒడిశాలో మూడు రైళ్ల ప్రమాద ఘటనను మరువకముందే మరో ఘటన జరిగింది. ఒడిశాలోని బెర్హంపూర్ స్టేషన్ వద్ద సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.