నేటి తరం సమాజంలో వస్తున్న మార్పులను చూస్తే చాలా మంది భయంతో వణికిపోతున్నారు. అత్యాచారాలు, హత్యలు చేస్తూ సమాజాన్ని చెడు దారికి మార్గం చూపిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా వావి వరసలు మరిచి అత్యాచారాలు చేస్తూ దారుణాలకు తెగబడుతున్నారు కొందరు కేటుగాళ్లు. ఇలాంచి ఘటనే తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకుంది.
జూన్ 6వ తేదీన ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కో విమానంలో సాంకేతిక లోపం కారణంగా దారి మళ్లింపు వల్ల ప్రభావితమైన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా శుభవార్త చెప్పింది. ఎయిర్ ఇండియా ప్రయాణికులందరికీ పూర్తి మొత్తాన్ని వాపసు చేస్తుందని ఎయిర్ ఇండియా చీఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అండ్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఆఫీసర్ రాజేష్ డోగ్రా తెలిపారు.
తమిళనాడు రాష్ట్రంలో ఒక గుడికి సీల్ వేశారు, మరో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. కారణం, షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారికి ఆలయంలోకి రాకుండా కొందరు వ్యక్తులు ప్రవేశం నిరాకరించడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. సీల్ వేసిన గుడి తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని మెల్పాడి సమీపంలోని ద్రౌపది అమ్మన్ ఆలయం కాగా.. వీరనంపట్టిలోని కాళియమ్మన్ ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.
బెంచ్‌మార్క్ రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించాలని ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం తెలిపారు. రెపో రేటు మారకపోవడంతో, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్‌డీఎఫ్ రేటు) 6.25 శాతంగా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ బ్యాంక్ రేట్లు 6.75 శాతంగా ఉన్నాయని శక్తికాంత దాస్ చెప్పారు.
ఏపీలో ఇటీవల నిర్వహించిన లక్ష్మీ రాజ శ్యామల యాగం చేసిన ఫలితంగా అనుకూల పరిస్థితులు వచ్చాయని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న నిధులు ఇప్పుడే వచ్చాయన్నారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోఆరెకటిక సంఘం నూతన భవనానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ ఆసుత్రుల్లో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించి మెరుగైన వైద్యం అందిస్తున్నామని మంత్రి హరీష్ రావు చెప్పారు.
తిరుపతిలో గ్రాండ్‌గా 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌లో ఆదిపురుష్ సినిమా డైరెక్టర్ ఓం రౌత్ ప్రొడ్యూసర్లను ఓ కోరిక కోరారు. ఏ వేదిక మీద అయినా రామాయణం కథ జరుగుతున్నా హనుమంతుడు అక్కడికి వచ్చి వీక్షిస్తారని.. తన తల్లి చెప్పినట్లు డైరెక్టర్ తెలిపారు.
పార్లమెంట్ సంబంధిత వ్యవహారాలపై చర్చ చాలా ముఖ్యమని, కానీ రాను రాను ఈ సంప్రదాయం క్షీణిస్తోందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. నూతన పార్లమెంటు భవనం గురించి రాజకీయ పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిందని ఆయన అన్నారు.
ఒడిశా ప్రభుత్వం మంగళవారం బాలాసోర్ రైలు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్యను 288 అని అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జెనా తెలిపారు.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం నిర్మాణంలో ఉన్న గోడ కూలి ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.