ఒడిశా రైలు ప్రమాద బాధితులకు ఆంధ్రప్రదేశ్ సర్కారు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.10 లక్షలు అందించనుండగా.. గాయపడిన వారికి రూ.లక్ష పరిహారం ఇవ్వనుంది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పోలవరం పర్యటనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 6న పోలవరం ప్రాజెక్టును జగన్ సందర్శించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణంపై అధికారులకు కీలక సూచనలు చేయనున్నారు. సీఎం జగన్ ప్రత్యేక హెలికాప్టర్‌లో అమరావతి నుంచి ఉదయం 10.15 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు.
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 290 మందికి పైగా చనిపోగా 1100 మందికి పైగా ప్రయాణికులు గాయాలపాలయ్యారు. యావత్ దేశాన్ని కలవరపరిచిన ఈ ఘోర ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం హై లెవల్ కమిషన్ వేసింది.
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటన ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ప్రమాద ఘటనపై స్పందించారు. ఈ ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ఏపీ రాజకీయాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చాలా కాలం అనంతరం చంద్రబాబు అమిత్ షాతో భేటీ కావడం, ఇవాళ ప్రధాని మోదీని కలుస్తుండడం చర్చనీయాంశంగా మారింది.