NCB: డార్క్‌నెట్, క్రిప్టోకరెన్సీని ఉపయోగించిన పాన్-ఇండియా డ్రగ్ నెట్‌వర్క్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఛేదించింది. 15 వేల ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ను ఎన్సీబీ సీజ్ చేసింది. ఈ వ్యవహరంలో ఆరుగురిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది. అరెస్టైన వారి ఇద్దరు రష్యన్లు అని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జ్ఞానేశ్వర్ సింగ్ తెలిపారు. డార్క్ వెబ్ ద్వారా నిర్వహించబడుతున్న డ్రగ్ ట్రాఫికర్లలో పాన్-ఇండియా నెట్‌వర్క్ భాగమని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో తెలిపింది. గత రెండు దశాబ్దాలలో ఎన్సీబీ చేసిన అతిపెద్ద జప్తుల్లో ఇది ఒకటని జ్ఞానేశ్వర్ సింగ్ వెల్లడించారు.ఫేక్ ఐడీలు, నకిలీ డాక్యుమెంట్స్, ఫారిన్ కరెన్సీ స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు.
Read Also: Odisha Train accident: ఒడిశా రైలు ప్రమాదంలో 40 మంది కరెంట్ షాక్‌తో మృతి..
నిందితుల నుంచి 2.5 కిలోల గంజాయి , రూ.4.65 లక్షల నగదు, బ్యాంక్ ఖాతాలలో జమ చేసిన రూ. 20 లక్షలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎల్‌ఎస్‌డీ లేదా లైసెర్జిక్ యాసిడ్ డైథైలామైడ్ అనేది ఒక సింథటిక్ రసాయన ఆధారిత డ్రగ్, ఇది చాలా ప్రమాదకరమని ఆయన చెప్పారు. ఈ మాదకద్రవ్యాల నెట్‌వర్క్ పోలాండ్, నెదర్లాండ్స్, యునైటెడ్ స్టేట్స్‌తో పాటు రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ-ఎన్సీఆర్ వంటి కొన్ని భారతీయ రాష్ట్రాలలో విస్తరించి ఉందని చెప్పారు. ఈ డ్రగ్‌ను పోలాండ్, నెదర్లాండ్స్, యునైటెడ్ స్టేట్స్ నుండి భారతదేశానికి దిగుమతి చేసుకునేవారు. డ్రగ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్ డార్క్‌నెట్‌లో యాక్టివ్‌గా ఉందని, క్రిప్టోకరెన్సీ ద్వారా చెల్లింపు జరిగిందని ఆయన చెప్పారు. ఎల్‌ఎస్‌డీ వాసన, రుచి లేనిదని, పుస్తకాల సహాయంతో రవాణా చేయడం వల్ల గుర్తించడం కష్టమని ఆయన అన్నారు. దేశంలో యువతలో ఈ డ్రగ్ బాగా ప్రాచుర్యం పొందిందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్ నెట్‌వర్క్‌లో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది విద్యావంతులు, యువకులే ఉన్నారని ఈ సందర్భంగా చెప్పారు.
Read Also: Pakistan: అప్పుల ఊబిలో పాక్.. రికార్డు స్థాయిలో పెరిగిన ద్రవ్యోల్బణం
అన్ని లావాదేవీలు వర్చువల్‌గా ఉన్నాయని, అనుమానితులు కమ్యూనికేట్ చేయడానికి ప్రైవేట్ మెసేజింగ్ యాప్‌లను ఉపయోగించారని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జ్ఞానేశ్వర్ సింగ్ వెల్లడించారు. ఎల్‌ఎస్‌డీ అక్రమ రవాణా చేయడం చాలా సులభం.. ట్రేస్ చేయడం దాదాపు కష్టమని ఆయన తెలిపారు. వాణిజ్య పరిమాణంలో 5 లేదా 6 బ్లాట్‌లు ఉంటాయని చెప్పారు. 2021 సంవత్సరంలో మొత్తం 5000 బ్లాట్‌లను ఎన్సీబీ జప్తు చేసిందన్నారు.ఢిల్లీ జోనల్ బృందం అనేక యూనిట్ల సహాయంతో కార్టెల్‌ను ఛేదించామని తెలిపారు. భారతదేశం నెమ్మదిగా ఎల్‌ఎస్‌డీ పెద్ద వినియోగదారుగా మారుతోంది..ఇది ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు.