Bihar Minister Tej Pratap Yadav: ఆదివారం భాగల్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడానికి బీజేపీనే కారణమని బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోపించారు. “బీజేపీ వంతెన కూలిపోవడానికి కారణమైంది. మేము వంతెనలను నిర్మిస్తాము.. బీజేపీ వాటిని నాశనం చేస్తూనే ఉంది” అని తేజ్ ప్రతాప్ యాదవ్ అన్నారు. ఇటీవల బీహార్ బ్రిడ్జి కూలిన ఘటనపై బీహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ రాజీనామా చేస్తారా అని బీజేపీకి చెందిన అమిత్ మాల్వియా ప్రశ్నించడంపై విలేకరులు తన వ్యాఖ్యను కోరిన తర్వాత ఆయన స్పందించారు. భాగల్‌పూర్‌లో గంగా నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడం రాజకీయంగా, సామాజికంగా కలకలం రేపింది. 3.16 కిలోమీటర్ల వంతెన ఖగారియా జిల్లాను భాగల్‌పూర్‌తో కలిపేలా ఉంది.వంతెన మధ్య భాగం ఖగారియా, అగువానీ, సుల్తాన్‌గంజ్ మధ్య గంగా నదిపై నిర్మించబడింది. గత ఏడాది ఏప్రిల్ 30న వంతెనపై కొంత భాగం కూలిపోయింది.
Read Also: NCB: పాన్-ఇండియా డ్రగ్ నెట్‌వర్క్‌ను ఛేదించిన ఎన్సీబీ.. వేల కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
ఇదిలా ఉండగా.. బ్రిడ్జి కూలిన ఘటనపై బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌పై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ సీఎం, డిప్యూటీ సిఎం పదవులకు రాజీనామా చేస్తారా అని బీజేపీ నేత అమిత్ మాలవీయ ప్రశ్నించారు. “2020 నాటికి పూర్తి చేయాల్సిన ఈ వంతెనను 2015లో నితీష్ కుమార్ ప్రారంభించారు. ఈ వంతెన రెండోసారి కూలిపోయింది. ఈ ఘటనను గుర్తించిన నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ తక్షణమే రాజీనామా చేస్తారా? ఇలా చేయడం ద్వారా దేశం ముందు ఆదర్శంగా నిలవగలరు’ అని అమిత్ మాలవీయ ట్వీట్‌లో పేర్కొన్నారు. వంతెన రెండు భాగాలు వరుసగా కూలిపోయి గంగా నదిలో పడిపోయాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. బీహార్‌లోని ఖగారియాలో రూ.1,717 కోట్లతో అగువానీ- సుల్తాన్‌గంజ్ గంగా వంతెనను నిర్మిస్తున్నారు.