Pakistan: దాయాది దేశమైన పాక్ అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వ మొత్తం అప్పులు ఏడాది ప్రాతిపదికన 34.1 శాతం పెరిగి ఏప్రిల్ చివరి నాటికి రూ. 58.6 ట్రిలియన్‌లకు చేరుకున్నాయని ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ తాజా నివేదిక తెలిపింది. నెలవారీ ప్రాతిపదికన ఈ పెరుగుదల 2.6 శాతంగా ఉందని డాన్ వార్తాపత్రిక మంగళవారం నివేదించింది. దేశీయ రుణం మొత్తం రూ.36.5 ట్రిలియన్లు (62.3 శాతం) కాగా.. బాహ్య రుణం ఏప్రిల్ చివరి నాటికి రూ.22 ట్రిలియన్లతో 37.6 శాతం వాటాను కలిగి ఉంది. వార్షిక ప్రాతిపదికన, విదేశీ రుణాల పెరుగుదల 49.1 శాతంగా ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ (SBP) డేటా తెలిపింది. నెల క్రితం నుంచి విదేశీ రుణాల లెక్కల్లో ఎలాంటి మార్పు లేదు.
దేశీయ రుణంలో దాదాపు రూ.25 ట్రిలియన్ల విలువైన రుణాలను సూచించే ఫెడరల్ ప్రభుత్వ బాండ్‌లలో అత్యధిక వాటా ఉంది. దేశీయ రుణానికి ఇతర ప్రధాన సహకారాలు, స్వల్పకాలిక రుణాలు (రూ. 7.2 ట్రిలియన్లు), జాతీయ పొదుపు పథకాల ద్వారా తీసుకున్న రుణాలు (రూ. 2.9 ట్రిలియన్లు)గా ఉన్నాయి. ఫెడరల్ ప్రభుత్వ బాండ్ల ద్వారా పొందిన నిధులు ఏడాది క్రితం కంటే 31.6 శాతం పెరిగాయి. స్వల్పకాలిక రుణాల స్టాక్‌లో పెరుగుదల 29.4 శాతంగా ఉంది. ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ విదేశీ మారక నిల్వల లేమితో సంక్షోభంతో పోరాడుతోంది. మరోవైపు రికార్డు స్థాయిలో అధిక ద్రవ్యోల్బణం మధ్య వడ్డీ రేటు అపూర్వమైన స్థాయికి చేరుకోవడంతో దేశీయ రుణ సేవలు దేశానికి భారీ సవాలుగా మారుతున్నాయి.
Read Also: Odisha Train accident: ఒడిశా రైలు ప్రమాదంలో 40 మంది కరెంట్ షాక్‌తో మృతి..
టాప్‌లైన్ సెక్యూరిటీస్ సీఈవో మొహమ్మద్ సోహైల్ ప్రకారం.. 2023-24లో మార్క్-అప్ ఖర్చు మాత్రమే 2020-21 ఫెడరల్ బడ్జెట్ కంటే ఎక్కువగా ఉంటుంది. రుణాలపై వడ్డీ రెండేళ్లలో రెండింతలు పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై పెరుగుతున్న భారం వల్ల ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలపై ఖర్చు చేయలేని పరిస్థితి నెలకొంటోందని టాప్‌లైన్ సెక్యూరిటీస్ సీఈవో అన్నారు.
Read Also: Galaxies: ఒకే ఫ్రేమ్‌లో 45,000 గెలాక్సీలు..
ప్రస్తుతం పెద్ద రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్.. అధిక బాహ్య రుణాలు, బలహీనమైన స్థానిక కరెన్సీ, క్షీణిస్తున్న విదేశీ మారక నిల్వలతో పోరాడుతోంది. దేశ గణాంకాల బ్యూరో ప్రకారం, మార్చిలో 35.4 శాతం నుంచి ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం 36.4 శాతం వరకు పెరిగింది. ఇది ప్రధానంగా ఆహార ధరల కారణంగా పెరిగినట్లు తెలుస్తోంది. ఇది దక్షిణాసియాలోనే అత్యధికం. ఇదిలావుండగా.. ఇంటర్‌బ్యాంక్, ఓపెన్/గ్రే మార్కెట్‌లో డాలర్ ధరల మధ్య విస్తృత అంతరం కారణంగా ఆర్థిక సంవత్సరం మొదటి 10 నెలల్లో విదేశాల నుంచి పంపిన రెమిటెన్స్‌లలో పాకిస్తాన్ దాదాపు 13 శాతం పడిపోయింది. మంగళవారం మార్కెట్ ప్రారంభమైన వెంటనే అమెరికా డాలర్‌తో పోలిస్తే పాకిస్థాన్ రూపాయి విలువ కోల్పోయింది. ఇంటర్‌బ్యాంక్‌లో డాలర్ రూ.285-286 వద్ద కోట్ కాగా, బహిరంగ మార్కెట్‌లో దాదాపు 310 నుంచి 314 రూపాయలకు విక్రయిస్తున్నట్లు జాతీయ ఫారెక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జాఫర్ పర్చా తెలిపారు.