Adulterated Milk: రాజమండ్రిలో కల్తీ పాలతో నలుగురు మృతి.. వెలుగులోకి సంచలన విషయాలు!
- రాజమండ్రి: కల్తీ పాల విషాదానికి సంబంధించి వెలుగులోకి సంచలన విషయాలు..
- పాలల్లో ఇథిలీన్ గ్లైకాల్ కలిసినట్లు అధికారుల దర్యాప్తులో నిర్ధారణ..
- కూలెంట్ గా ఉపయోగించే ఇథిలీన్ గ్లైకాల్ పాలల్లో కలిసనట్లుగా గుర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adulterated Milk: రాజమండ్రిలో చోటు చేసుకున్న కల్తీ పాలు విషాదానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నలుగురు మృతి చెందగా, మరో 8 మంది కిడ్నీ సమస్యలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఘటనకు కారణమైన పాలల్లో ఇథిలీన్ గ్లైకాల్ కలిసిందని అధికారుల విచారణలో నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తుంది. ఈరోజు ఫోరెనిక్స్ నివేదికలు వస్తే అధికారికంగా నిర్ధారణ అయ్యే ఛాన్స్ ఉంది.
Read Also: Ravi Teja : భర్త మహశయులకు విజ్ఞప్తి ఓటీటీ రిలీజ్ కు బ్రేక్.. కారణం ఏంటంటే?
Also Read
- Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం నరసాపురంకు చెందిన గణేష్ అనధికారికంగా నిర్వహిస్తున్న వరలక్ష్మీ డెయిరీలో, పాలు కల్తీ జరిగినట్లు అధికారులు గుర్తించారు. డెయిరీలోని రిఫ్రిజిరేటర్ లో కూలెంట్‌గా వినియోగించే ఇథిలీన్ గ్లైకాల్ ఈ నెల 15వ తేదీన లీకై, ఒక పాల క్యాన్‌లో కలిసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అదే రోజు సరఫరా చేసిన పాలు వినియోగించిన కుటుంబాల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో రాజమండ్రిలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాలకు చెందిన నాలుగు కుటుంబాల్లో 12 మంది, అనూరియా సమస్యతో ఆసుపత్రుల్లో చేరారు.
Read Also: AP Cabinet: నేడే ఏపీ కేబినెట్.. పేదలకు ఇళ్ల స్థలాలపై కీలక చర్చ!
కాగా, ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 8 మందికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉండగా, ఒక చిన్నారి మరో ఇద్దరు వృద్ధుల పరిస్థితి విషమంగా ఉంది. కాగా, పాలల్లో కలిసిన ఇథిలీన్ గ్లైకాల్ సాధారణంగా రిఫ్రిజిరేటర్ లలో కూలెంట్‌గా ఉపయోగిస్తారు. ఇది శరీరంలోకి వెళ్లినప్పుడు తీవ్రమైన విష ప్రభావం చూపి కిడ్నీలను దెబ్బతీస్తుంది. అధిక మోతాదులో తీసుకుంటే మూత్రపిండాల కరబ్ అయి, మెదడు దెబ్బతినడం, ఆకస్మికంగా చనిపోయే ప్రమాదం ఉంటుంది. బాధితుల్లో కనిపించిన లక్షణాలు ఈ రసాయన ప్రభావంతో సరిపోయినట్లు వైద్యులు పేర్కొంటున్నారు.
ఇక, పాలు, పెరుగు నమూనాలను సేకరించి సెంట్రల్ ఫోరెనిక్స్ సైన్స్ ల్యాబ్ కు, స్టేట్ ఫోరెనిక్స్ సైన్స్ ల్యాబ్ లకు ఇప్పటికే అధికారులు పంపించారు. కాగా, వందలాది మంది రక్త నమూనాలు సేకరించగా, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఈరోజు రానున్నాయి. అధికారిక నివేదికలతో కల్తీ పాల వ్యవహారంపై పూర్తి స్థాయిలో నిర్ధారణ కానుంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు