ఉత్తరాది రాష్ట్రాలను గత మూడ్రోజులుగా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో యమునా నది ఉప్పొంగుతోంది.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో ఓటమి తర్వాత సరిగ్గా నెల రోజుల విరామం అనంతరం భారత అభిమానుల కోసం మళ్లీ క్రికెట్ సందడి మొదలైంది. భారత జట్టు మరోసారి సంప్రదాయ క్రికెట్‌లో కొత్త పోరుకు సన్నద్ధమైంది. 2023–25 డబ్ల్యూటీసీ క్యాలెండర్‌లో భాగంగా భారత్ తమ తొలి సిరీస్ బరిలోకి దిగనుంది.
ఆరుగురు రెజ్లర్లపై లైంగిక వేధింపుల విషయంలో, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఆయన విచారణను ఎదుర్కోవచ్చని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.
ఓ వ్యక్తి తన ఇద్దరు భార్యల చేతిలో దారుణంగా హత్య చేయబడ్డాడు. ఈ దారుణ ఘటన బీహార్‌లోని ఛప్రాలో జరిగింది. ముగ్గురి మధ్య గొడవ జరగడంతో 45 ఏళ్ల వ్యక్తిని అతని భార్య, మాజీ భార్య కత్తితో పొడిచి చంపారు.
గూఢచర్యం ఆరోపణలపై విదేశాంగ మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న వ్యక్తిని ఘజియాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల ప్రకారం, పోలీసులు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి సమాచారం అందుకున్న తర్వాత నవీన్ పాల్ అనే వ్యక్తిని క్రాసింగ్స్ రిపబ్లిక్ ప్రాంతం నుంచి పట్టుకున్నారు.
కర్ణాటక అసెంబ్లీ భవనం (విధాన సౌధ)లో ముస్లింల కోసం ప్రార్థన గదిని కోరుతూ జనతాదళ్ (సెక్యులర్) లెజిస్లేటివ్ కౌన్సిల్ (MLC) సభ్యుడు బీఎం ఫరూక్ ఎగువ సభ చైర్మన్‌కు లేఖ రాశారు. అయితే నమాజ్ చేసేందుకు గది కావాలని కోరగా.. ఛైర్మన్ స్పందించలేదు.
నేపాల్‌లోని సోలుకుంబు నుంచి ఖాట్మండుకు ప్రయాణిస్తున్న సమయంలో ఐదుగురు విదేశీ పౌరులతో సహా ఆరుగురితో కూడిన హెలికాప్టర్ ఈ రోజు అదృశ్యమైంది. 9ఎన్‌ఎండబ్ల్యూ కాల్ గుర్తుతో ఉన్న ఛాపర్ ఉదయం 10:15 గంటలకు కంట్రోల్ టవర్‌తో సంబంధాన్ని కోల్పోయింది.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ఆగస్టు 2 నుంచి సుప్రీంకోర్టు విచారించనుంది. సోమ, శుక్రవారాలు మినహా మిగిలిన రోజుల్లో సోమ, శుక్రవారాలు మినహా మిగిలిన రోజుల్లో పిటిషన్లపై విచారణ ఉంటుంది.
ఉత్తర కొరియా నియంత్రిస్తున్న ప్రాంతం గగనతలంలోకి అమెరికా మిలిటరీ గూఢచారి విమానం ఎనిమిది సార్లు ప్రవేశించిందని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ తెలిపారు. తమ దేశానికి చెందిన యుద్ధ విమానాలు ఆ అమెరికా గూఢచారి విమానాన్ని తరిమికొట్టాయని అన్నారు.