రాజస్థాన్‌లో సినీ ఫక్కీలో ఓ నిందితుడి హత్య జరిగింది. చాలా సినిమాల్లో ఇలాంటి ఘటనలు చూసే ఉంటాం. నిందితుడు ఓ కేసులో ఇరుక్కుంటే.. అతడి వల్ల వారు పట్టుబడుతారేమోనని పోలీసుల ఎదుటే చంపేస్తారు. అలాంటి ఘటనే తాజాగా రాజస్థాన్‌లో జరిగింది.
బెంగళూరులో మంగళవారం జరిగిన జంట హత్యల కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల జంట హత్యలు జరిగిన ఒక రోజు తర్వాత, ప్రధాన నిందితులు సహా ముగ్గురిని బుధవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) ఎయిర్‌పోర్ట్‌లో ఓ విమానం ప్రమాదానికి గుర్తింది. హెచ్‌ఏఎల్ ఎయిర్ పోర్టు నుంచి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి బయల్దేరిన ప్రీమియర్ 1ఏ ఎయిర్ క్రాఫ్ట్ లో సాంకేతిక సమస్య తలెత్తింది.
కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ జూలై 17-18 తేదీల్లో బెంగళూరులో జరిగే విపక్ష నేతల తదుపరి సమావేశానికి హాజరవుతారని, దీనికి 24 పార్టీలను ఆహ్వానించినట్లు పలు వర్గాలు తెలిపాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వారంలో రెండు రోజులపాటు ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటన వేళ ఫ్రాన్స్ నుంచి 26 రాఫెల్ యుద్ధ విమానాలను, 3 స్కార్పెన్ క్లాస్ జలాంతర్గాములను కొనుగోలు చేయాలని భారత్ యోచిస్తోంది.
నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ భార్య సీతా దహల్(69) బుధవారం కన్నుమూశారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు ఆమెకు గుండెపోటు వచ్చిందని, ఆ తర్వాత మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. తమ గగనతలాన్ని ఉల్లంఘించిన యూఎస్ గూఢచారి విమానాలను కూల్చివేస్తామని ఉత్తర కొరియా బెదిరించిన మరునాడే ఈ పరీక్ష నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఉత్తర కొరియా జపాన్ సముద్దం అని పిలవబడే తూర్పు సముద్రం వైపు బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చెప్పారు.
నేడు ఢిల్లీలో ప్రధాని నేతృత్వంలో కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో మంత్రి వర్గ పునర్వవ్యస్థీకరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీనిపై పూర్తిగా కసరత్తు చేసిన ప్రధాని మోడీ మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది
ఉత్తర భారతదేశంలో కుండపోత వర్షాలు కొనసాగుతుండటంతో భారీ వర్షాలు, వరద సంబంధిత సంఘటనలలో 100 మందికి పైగా మరణించారు. గత వారం వర్షం ప్రారంభమైనప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోనే దాదాపు 80 మంది మరణించారు.