బ్రిటన్‌లోని నాటింగ్‌హామ్‌లో నివాసం ఉంటున్న ఒక యువతికి తన ఇంటి క్రింది భాగంలో ఒక రహస్య గది కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని ఆ అమ్మాయి తన స్నేహితులతో, అధ్యాపకులకు చెప్పగా వారందరు ఆత్రుతతో అందులో ఏముందో అని చూసే ప్రయత్నం చేశారు.
నెల్లూరు జిల్లా పొదలకూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
ఏలూరు జిల్లాలోని కుక్కునూరు మండలం గొమ్ముగూడెంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. వరద బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వరద నష్టాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు.
కుక్కకి పట్టెడన్నం పెడితే చాలు ప్రాణం పోయేవరకు విశ్వాన్ని చూపిస్తుంది. ఆ విశ్వాసం కారణంగానే గ్రామసింహం అనే పేరుని సంపాదించింది శునకం. ఆకలి తీర్చిన వారిపైన విశ్వాసాన్ని చూపడమే కాదు మంచిగా శిక్షణ ఇస్తే శునకం చెయ్యని పనంటూ ఉండదు. అందుకే దేశ భద్రత వ్యవస్థలలో కూడా శునకాన్ని అగ్రతాంబూలం ఇస్తారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆదిమూలపు సురేష్ విరుచుకుపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వెలిగొండ ప్రాజెక్టు గురించి పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు నంగనాచి కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విద్యాబోధనపై సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ తర్వాత తన ట్విట్టర్ బయోను"మెంబర్ ఆఫ్ పార్లమెంట్"గా మార్చారు. మోడీ ఇంటిపేరుపై వ్యాఖ్యలకు సంబంధించి ఆయనపై దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసుపై దిగువ సభ నుంచి సస్పెన్షన్‌కు గురైన తర్వాత రాహుల్‌గాంధీ బయో గతంలో "డిస్ క్వాలిఫైడ్ ఎంపీ" అని ఉండేది.
దళిత రచయిత, గద్దర్‌గా అందరికీ సుపరిచితమైన గుమ్మడి విఠల్ రావు ప్రముఖ విప్లవ కవి. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ఎంతో కీలక పాత్ర పోషించిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ తుదిశ్వాస విడిచారు.