Secret Cave: బ్రిటన్‌లోని నాటింగ్‌హామ్‌లో నివాసం ఉంటున్న ఒక యువతికి తన ఇంటి క్రింది భాగంలో ఒక రహస్య గది కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని ఆ అమ్మాయి తన స్నేహితులతో, అధ్యాపకులకు చెప్పగా వారందరు ఆత్రుతతో అందులో ఏముందో అని చూసే ప్రయత్నం చేశారు. ది సన్ రిపోర్ట్ ప్రకారం ఇది రెండు వందల సంవత్సరాల క్రితం నాటి నేలమాళిగ.. అందులో ఏముందో తెలుసుకోవడానికి అందులోకి దిగిన అమ్మాయిలకి అక్కడ ఒక ఫ్లోర్ కనిపించింది.. అక్కడ నాలుగు మూలాల బెంచీలు, అక్కడక్కడా అలమారాలు కూడా కనిపించాయి. చూడడానికి అదో స్టోర్ రూమ్ లా ఉంది. అయితే ఆ అమ్మాయి కుటుంబం ఆ ఇంట్లోకి దిగేముందు వారికి ఈ విషయం తెలియదు.
Also Read: Delhi Ordinance Bill: ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును రాజ్యసభలో వ్యతిరేకించిన కాంగ్రెస్, ఆప్
నాటింగ్‌హామ్ ట్రెంట్ యూనివర్సిటీ జర్నలిజం విద్యార్థి స్టెఫానీ బెన్నెట్.. కొద్దిపాటి ఆందోళనల మధ్య మీడియాకు ఈ విషయాన్ని తెలియజేసింది. ఆమె మాట్లాడుతూ..” అదేమీ అంత పెద్ద గది కాదు కేవలం 6 అడుగుల పొడవు, 4 అడుగుగుల వెడల్పు కలిగి ఉన్న చిన్నగది. ఈ గదిలోకి మా ప్రయాణం చాల ఆసక్తికరంగా సాగింది. అందులో ఏముందో తెలుసుకోవాలనే ఆత్రుతతో మేమందరం ఒక్కసారిగా ఆ గదిలోకి ప్రవేశించాము. కానీ ఆ గదిని ఎందుకు ఉపయోగించుకునేవారో తెలుసుకోలేక పోయాం” అని వెల్లడించింది..
ఈ యువతుల బృందం ఈ విషయాన్ని పురావస్తు శాఖ వాళ్లకి తెలియచేయగా వారు వెంటనే గుహను సందర్శించారు. ఆ గుహ రెండు వందల సంవత్సరాల నాటిదని పేర్కొన్నారు.నాటింగ్‌హామ్ సిటీ కౌన్సిల్ యాక్టింగ్ ఆర్కియాలజిస్ట్ స్కాట్ లొమాక్స్ మాట్లాడుతూ.. ఆ గుహ ఒక నేలమాళిగ అని తెలిపారు. దానిపైన భవనం నిర్మించడాన్ని పరిశీలిస్తే అది 19 వ శతాబ్దం నాటిదిగా తెలుస్తుంది అన్నారు. ఈ నేలమాళిగ ఎన్నో పురాతన విశేషాలను తెలియచేస్తుందన్నారు.