కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తొలి దశకు విశేష స్పందన లభించిన తర్వాత, ఇప్పుడు గుజరాత్ నుంచి మేఘాలయ వరకు రెండో దశను ప్లాన్ చేసినట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే మంగళవారం తెలిపారు.
మహిళలపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి రాజస్థాన్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చేయవచ్చని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. మహిళలపై నేరాలను అరికట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని నొక్కి చెప్పారు.
గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియం వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. కీలకమైన ఈ మూడో టీ20లో భారత జట్టు టాస్ ఓడింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్‌కు రానుంది.
మిస్ ఇండోనేషియా యూనివర్స్ పోటీకి చెందిన ఆరుగురు పోటీదారులు నిర్వాహకులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోటీ సమయంలో తాము టాప్‌లెస్ 'బాడీ చెక్'లకు గురయ్యామని పోటీదారులు ఆరోపించారు.
పురాతన పుర్రె శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. ఎందుకంటే ఇది తెలిసిన మానవ పూర్వీకులకు భిన్నంగా ఉండడమే కారణం. అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం చైనాలో కనుగొనబడిన పురాతన పుర్రె ఇంతకు ముందు చూసిన మానవులకు భిన్నంగా ఉందని పేర్కొంది.
ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుభాసిస్ తలపాత్ర మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఒడిశా హైకోర్టు ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఒడిశా గవర్నర్ ప్రొఫెసర్ గణేశి లాల్ కొత్త ప్రధాన న్యాయమూర్తితో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నగర పాలక సంస్థ సేవలు మరియు విజిలెన్స్ విభాగాలను అతిషికి అప్పగించాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ప్రతిపాదనను పంపినట్లు అధికారిక వర్గాలు మంగళవారం తెలిపాయి.
కేంద్రంపై విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ కొనసాగుతోంది. మణిపూర్ అంశంపై గత కొన్ని రోజులుగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాదోపవాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విపక్షాలు కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ సస్పెన్షన్‌పై రాజ్యసభలో హైడ్రామా కొనసాగింది. మొదట రాజ్యసభ నుంచి టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్‌ను రాజ్యసభ చైర్మెన్ సస్పెండ్ చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని ఆయన ప్రకటించారు.