ప్రజా యుద్ధనౌక, ప్రజా గాయకుడు గద్దర్ మరణవార్త విని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగు ప్రజలతో పాటు దేశంలోని ప్రముఖులు షాక్ అవుతున్నారు. రెండు రోజుల కిందటే ఆయనకు గుండె ఆపరేషన్ జరిగి విజయవంతం అయిందని.. కుటుంబసభ్యులు వెల్లడించారు.
దళిత రచయిత, గద్దర్‌గా అందరికీ సుపరిచితమైన గుమ్మడి విఠల్ రావు ప్రముఖ విప్లవ కవి. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ఎంతో కీలక పాత్ర పోషించిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ తుదిశ్వాస విడిచారు.
ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. గద్దర్ చనిపోయినట్లు కొడుకు సూర్యం తెలిపారు. ఇవాళ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గద్దర్ తుదిశ్వాస విడిచారు.
ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్ జిల్లాలో ఇద్దరు మైనర్ బాలురకు మూత్రం తాగించి, వారి మలద్వారంలో పచ్చిమిర్చి రుద్దారు. దొంగతనం చేశారనే అనుమానంతో బలవంతంగా కొన్ని గుర్తు తెలియని ఇంజెక్షన్లు ఇచ్చారు. బాధితులు 10, 15 సంవత్సరాల వయస్సు గల బాలురు కావడం గమనార్హం.
నర్సుగా నటించి ఆస్పత్రిలో ఉన్న స్నేహితుడి భార్యనే హతమార్చాలని ప్రయత్నించింది ఓ మహిళ. ఇంజెక్షన్ వేసి ఆమెను చంపాలని వ్యూహం పన్నింది. కానీ అది బెడిసికొట్టి పోలీసులకు చిక్కింది.
జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయానికి నేటితో నాలుగేళ్లు పూర్తయ్యాయి. జమ్మూకశ్మీర్ అభివృద్ధి కోసమే ఆర్టికల్ 370ని రద్దు చేశామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. జమ్మూ, కశ్మీర్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించింది.
హిందూ దేవతలపై అభ్యంతరకర వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినందుకు ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సాజిద్‌పై మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టడం, సామాజిక సామరస్యానికి భంగం కలిగించడం, విద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన అభియోగాలు ఎదుర్కొంటున్నట్లు పోలీసు అధికారి సుబే సింగ్ తెలిపారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌లో కాసేపట్లో కీలక ఘట్టం చోటుచేసుకోబోతోంది. భూ కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్-3 ప్రవేశించబోతోంది. ఈ మేరకు ఇస్రో కీలక ప్రకటన విడుదల చేసింది.
2011లో ఓ వ్యక్తిపై దాడి చేసిన కేసులో బీజేపీ ఎంపీ రామ్ శంకర్ కటారియాకు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 12 ఏళ్ల నాటి దాడి కేసుపై ఆగ్రా కోర్టు విచారణ జరిపింది. రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక మేజిస్ట్రేట్ రామ్ శంకర్ కటారియాను దోషిగా నిర్ధారిస్తూ ఈ ఉత్తర్వును ప్రకటించారు.