Kakani Govardhan Reddy: నెల్లూరు జిల్లా పొదలకూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 11 రకాల సర్టిఫికెట్లను ప్రజలకు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. చంద్రబాబు సభలకు ప్రజలు రావడం లేదని.. అందుకే మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Also Read: AP CM Jagan: పారదర్శకంగా పోలవరం పునరావాస ప్యాకేజీ .. అందరికీ న్యాయం చేస్తాం
పోలీసులకు వర్క్ ఫ్రం హోం ఇస్తామని చెబుతున్నాడు.. ఇది సాధ్యమయ్యేదేనా అంటూ ఎద్దేవా చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇలా మాట్లాడుతున్నారంటే ఆయన మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు. జిల్లాలో నెల్లూరు, సంగం బ్యారేజీల పనులు పూర్తి చేసి ప్రారంభించామన్నారు. సోమశిల.. కండలేరులలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచామని మంత్రి తెలిపారు. సోమశిల నుంచి కండలేరు జలాశయానికి వరద నీటిని పంపే కాలువ సామర్థ్యాన్ని కూడా పెంచిన ఘనత తమదేనని ఆయన వెల్లడించారు. కొన్ని మీడియా సంస్థలను అడ్డం పెట్టుకొని ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.