Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ తర్వాత తన ట్విట్టర్ బయోను”మెంబర్ ఆఫ్ పార్లమెంట్”గా మార్చారు. మోడీ ఇంటిపేరుపై వ్యాఖ్యలకు సంబంధించి ఆయనపై దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసుపై దిగువ సభ నుంచి సస్పెన్షన్‌కు గురైన తర్వాత రాహుల్‌గాంధీ బయో గతంలో “డిస్ క్వాలిఫైడ్ ఎంపీ” అని ఉండేది. రాహుల్‌గాంధీ సోమవారం ఎంపీగా లోక్‌సభలో అడుగుపెట్టారు. సర్వోన్నత న్యాయస్థానం స్టేతో లోక్‌సభ సభ్యత్వాన్ని లోక్‌సభ సెక్రటేరియట్ పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలో నాలుగు నెలల తర్వాత తొలిసారిగా రాహుల్‌గాంధీ లోక్‌సభలో అడుగుపెట్టారు. లోక్‌సభలోకి వచ్చే ముందు ఆయన పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్మగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు.
Also Read: Asia Cup 2023 Schedule: ఆసియా కప్ 2023 షెడ్యూల్ ఇదే.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే!
మోడీ ఇంటిపేరుపై వ్యాఖ్యలకు సంబంధించి ఆయనపై దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం రాహుల్ గాంధీకి విధించిన శిక్షను సుప్రీంకోర్టు శుక్రవారం తాత్కాలికంగా నిలిపివేసింది. కాంగ్రెస్ నాయకుడి వ్యాఖ్యలు మాటలు మంచి అభిరుచితో లేవని, ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి బహిరంగ ప్రసంగాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ధర్మాసనం పేర్కొందిం. శిక్ష విధించడానికి ట్రయల్ జడ్జి ఎటువంటి కారణం చెప్పలేదని.. తుది తీర్పు పెండింగ్‌లో ఉన్నందున దోషిగా నిర్ధారించే ఉత్తర్వును నిలిపివేయాలని బెంచ్ పేర్కొంది. అనర్హత వేటు వేయడమనేది ప్రజలపై ప్రభావం చూపుతుందని న్యాయస్థానం తన ఉత్తర్వులో పేర్కొంది.
ట్రయల్ కోర్టు రాహుల్ గాంధీకి గరిష్టంగా రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో రాహుల్ పార్లమెంటు సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించబడ్డారు. అయితే, శిక్షాకాలం ఒక్కరోజు తక్కువగా ఉండి ఉంటే, ఆయన ఎంపీగా అనర్హత వేటు పడేవారు కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. రేపు లోక్‌సభలో జరగనున్న అవిశ్వాస తీర్మానంపై చర్చలో రాహుల్ గాంధీ కీలక వక్తగా ఉంటారని కాంగ్రెస్ తెలిపింది.