కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి పార్లమెంటరీ సభ్యత్వం పునరుద్ధరణ తర్వాత ఢిల్లీలోని 12 తుగ్లక్ లేన్ బంగ్లాను తిరిగి కేటాయించినట్లు వర్గాలు మంగళవారం తెలిపాయి. ఎంపీగా అనర్హత వేటు పడటంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో బంగ్లాను ఖాళీ చేశారు.
దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతుండడంతో మహారాష్ట్రకు చెందిన ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. టమాటా ధరలు పెరగడం వల్ల దొంగతనాలు చాలా వరకు పెరిగిపోయాయి. ఇక అక్కడే ఉండి కాపలా కాయడం చాలా కష్టమని భావించిన రైతన్న తన పొలంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాందీ ఆగస్టు 12, 13 తేదీల్లో వయనాడ్‌లో పర్యటిస్తారని, ఎంపీగా తిరిగి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి తన నియోజకవర్గానికి పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం వెల్లడించారు. ఇది తిరిగి ఎంపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మొట్టమొదటి పర్యటన.
ఐపీఎల్-2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిరాశపరిచిన సంగతి తెలిసిందే. గతేడాది పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. మొత్తం సీజన్‌లో 14 మ్యాచ్‌లో నాలుగింట మాత్రమే గెలిచింది. ఈ విధంగా ఐపీఎల్‌లో గత కొన్నేళ్లుగా ఎస్‌ఆర్‌హెచ్ పేలవ ప్రదర్శనను కనబరుస్తోంది.
ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్-2023కి ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధంగా ఉంది. అక్టోబర్ 5న ప్రారంభ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో న్యూజిలాండ్‌తో తలపడనుంది. భారత్ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతున్న తరుణంలో టీమిండియాను కొన్ని అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు రెండో రోజు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. రేపు ఉదయం 9 గంటల ప్రాంతంలో రాజమండ్రి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి సీఎం జగన్ బయలుదేరనున్నారు.
అమ్మా తెలంగాణమా అంటూ అణువనువును తట్టిలేపిన ఆ స్వరం ఇక సెలవు తీసుకుంది. పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా.. పోరు తెలంగాణమా అంటూ.. తెలంగాణ గోసకు పతాకమైన నిలిచి ఆ గానం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.