TTD: తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త తెలిపింది. నేడు జరిగిన పాలకమండలి మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రేపటితో ప్రస్తుత పాలకమండలి పదవీకాలం ముగియనుండటంతో.. నేడు అన్నమయ్య భవన్‌లో చివరి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు, ఆస్పత్రుల అభివృద్ధి పనులకు సంబంధించి పెద్ద మొత్తంలో నిధులను కేటాయించారు. ఈ మేరకు పాలకమండలిలో తీసుకున్న నిర్ణయాలను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు.
టీటీడీ పాలకమండలి తీసుకున్న కీలక నిర్ణయాలివే..
*4 కోట్ల రూపాయలతో అలిపిరి నడకమార్గంలో నరసింహ స్వామి ఆలయం నుంచి మోకాలి మిట్ట వరకు భక్తులు సౌకార్యర్దం షెడ్లు ఏర్పాటు
*2.5 కోట్లతో పీఏసిలో భక్తులు సౌకర్యార్థం మరమ్మతు పనులు
*24 కోట్ల రూపాయల వ్యయంతో రెండు ఘాట్ రోడ్లలో క్రాష్ బ్యారియర్లు
*4.5 కోట్ల వ్యయంతో నాణ్యత పరీశిలనకు ల్యాబ్ ఆధునికీకరణ
*23.5 కోట్ల వ్యయంతో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద క్యూ కాంప్లెక్స్ నిర్మాణం
*శ్రీనివాసం వద్ద సబ్ వే నిర్మాణంకు 3 కోట్లు కేటాయింపు
*3.1 కోట్లు మంగాపురం ఆలయం వద్ద అభివృద్ది పనులకు కేటాయింపు
*9.85 కోట్లు వకుళామాత ఆలయం వద్ద అభివృద్ది పనులకు కేటాయింపు
*2.6 కోట్లువ్యయంతో తిరుమలలో అవుటర్ రింగ్ రోడ్డులో ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు
*శ్రీనివాస సేతు ప్రాజెక్ట్‌కి పనులు ప్రాతిపాదికన రూ.118 కోట్లు కేటాయింపు
*ఎస్వీ ఆయుర్వేద కళాశాల అభివృద్ది పనులకు 11.5 కోట్లు కేటాయింపు
*రుయాలో టీబీ వార్డు ఏర్పాటుకు 2.2 కోట్లు కేటాయింపు
*11 కోట్లు ఎస్వీ సంగీత కళాశాల అభివృద్ది పనులకు కేటాయింపు
*తిరుపతిలోని వేశాలమ్మ ఆలయం, పెద్ద గంగమ్మ ఆలయ అభివృద్ది పనులకు రూ.1.25 కోట్లు కేటాయింపు
*గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్‌ని టీటీడీ ఆస్థాన విద్వాంసుడిగా మరో మూడు సంవత్సరాలు పొడిగింపు
*టీటీడీ ఆస్థులు పరిరక్షణలో భాగంగా 69 స్థలాలకు కంచె ఏర్పాటుకు రూ.1.25 కోట్లు కేటాయింపు
*5 కోట్లు ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి ప్లాంట్ ఏర్పాటుకు కేటాయింపు