మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికాగా డైరెక్టర్ మెహర్ రమేశ్ తెరకెక్కించిన సినిమా భోళా శంకర్. ఈ సినిమా ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. భోళా శంకర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా దర్శకుడు మెహర్ రమేష్ సినిమా గురించి కీలక విషయాలు వెల్లడించారు.
అధికారిక లాంచనాలతో గద్దర్ అంత్యక్రియలు రేపు మహాబోధి విద్యాలయంలో జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి మణిపూర్‌లో ఎన్‌డీఏ మిత్రపక్షం కుకీ పీపుల్స్ అలయన్స్ (కేపీఏ) మద్దతు ఉపసంహరించుకుంది. కుకీ పీపుల్స్ అలయన్స్(కేపీఏ) అధ్యక్షుడు టోంగ్‌మాంగ్ హౌకిప్ మణిపూర్ గవర్నర్ అనుసూయా ఉకేకి లేఖ రాశారు.
ఛత్తీస్‌గఢ్‌లోని ఉక్కు ఫ్యాక్టరీలో ఆదివారం పేలుడు సంభవించి కార్మికుడు కాలిపోయి ప్రాణాలు కోల్పోయాడు. రస్మారాలోని రాయ్‌పూర్ స్టీల్ ప్లాంట్‌లో స్టీల్‌ను కరిగించే పని జరుగుతుండగా పేలుడు సంభవించింది.
ఆఫ్రికాలోని మొరాకో దేశంలో అత్యంత ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మొరాకోలోని అజిలాల్ సెంట్రల్ ప్రావిన్స్‌లో జరిగిన అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదంలో 24 మంది మరణించారని అధికారులు వెల్లడించారు.
ఢిల్లీ సర్వీసుల బిల్లు-2023ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రేపు(సోమవారం) రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఢిల్లీ ప్రభుత్వ సీనియర్ అధికారుల నియామకాలు, బదిలీలకు సంబంధించిన అధికారాలను లెఫ్టినెంట్ గవర్నర్‌కు బదిలీ చేసే ఆర్డినెన్స్ స్థానే కేంద్రం ఇటీవల తీసుకు వచ్చిన బిల్లును విపక్ష ఎంపీల ఆందోళన మధ్య లోక్‌సభ ఆమోదించిన సంగతి తెలిసిందే.
ప్రజా గాయకుడు గద్దర్ తన స్వరంతో కోట్లాది మంది ప్రజల్లో చైతన్య జ్వాలలను రగిల్చారు. చావుకు దగ్గరలో ఉన్నప్పుడు, చివరి క్షణాల్లో కూడా పాటను మాత్ర వదల్లేదు. అపోలో స్పెక్ట్రా ఆస్పత్రి ఐసీయూలోనూ పాటలు పాడారని మీడియాకు చెబుతూ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హజారా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 40 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తన కోటి మందికి పైగా ఉద్యోగులు, పింఛనుదారులకు కరువు భత్యాన్ని (డీఏ) మూడు శాతం పాయింట్లు పెంచి ప్రస్తుతం ఉన్న 42 శాతం నుంచి 45 శాతానికి పెంచే అవకాశం ఉంది.