AP CM Jagan: పారదర్శకంగా పోలవరం పునరావాస ప్యాకేజీ .. అందరికీ న్యాయం చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP CM Jagan: ఏలూరు జిల్లాలోని కుక్కునూరు మండలం గొమ్ముగూడెంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. వరద బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వరద నష్టాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. గొమ్ముగూడెంకు చెందిన వరద ముంపు బాధితులతో సమావేశంలో పాల్గొని సీఎం జగన్ మాట్లాడారు.
గత ప్రభుత్వాల కంటే భిన్నంగా వరద బాధితులను ఆదుకుంటున్నామని.. వరదలతో ఇళ్లు దెబ్బతింటే సాయం అందిస్తున్నామని సీఎం తెలిపారు. ఏ ఒక్కరూ సాయం అందలేదనకూడదన్నారు. సహాయక చర్యల్లో కలెక్టర్లకు అన్ని రకాల అధికారాలు ఇచ్చామని ముఖ్యమంత్రి చెప్పారు. వరద బాధితులకు సాయం అందకుంటే ఫిర్యాదు చేయొచన్నారు. పోలవరం డ్యాంలో మూడు దశల్లో నీళ్లు నింపుతామని.. ఒక్కసారిగా నింపితే డ్యామ్ కూలిపోవచ్చని సీఎం చెప్పుకొచ్చారు. సీడబ్ల్యూసీ నిబంధనల ప్రకారం పోలవరం డ్యాంలో నీళ్లు నింపుతామని.. కమిషన్ ఆదేశాల ప్రకారమే ముందుకెళ్తున్నామన్నారు.
Also Read
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
Also Read: TTD: ముగిసిన టీటీడీ పాలకమండలి సమావేశం.. కీలక నిర్ణయాలకు ఆమోదం
ఆర్ అండ్ ఆర్ విషయంలో కేంద్రం నిధులకు తోడు రాష్ట్రం నిధులు అందిస్తామని.. ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజీ కోసం కేంద్రం ఒత్తిడి తెస్తున్నామన్నారు సీఎం జగన్. జనవరి కల్లా ప్యాకేజీ అందే విధంగా చూస్తామన్నారు. 2025 ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తి చేసి నీరందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. వచ్చే 6,7 నెలల్లో మీకు రావాల్సిన ప్యాకేజీపై మంచి జరుగుతుందన్నారు. ఐదు లక్షల ప్యాకేజీలో ఒకటిన్నర లక్షలు ఇచ్చామని.. మిగిలిన రూ. 3.50 లక్షలు త్వరలో ఇస్తామన్నారు. అందరికీ తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పోలవరం పునరావాస ప్యాకేజీ పారదర్శకంగా అమలు చేస్తామన్నారు. లిడార్ సర్వే ద్వారా అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. లిడార్ సర్వే సైంటిఫిక్‌గా జరిగింది.. ఎవరికీ అన్యాయం జరగదన్నారు. భూములు కొనుగోలుకు సంబంధించి మరింత న్యాయం చేస్తామన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
Also Read: Kodali Nani: దాడి చేస్తే ఊరుకోం… పవన్ పై కొడాలి నాని షాకింగ్ కామెంట్స్..
అంతకు ముందు అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో సీఎం జగన్ పర్యటించారు. అక్కడ మాట్లాడుతూ.. పోలవరం నిర్మాణంలో మా ప్రభుత్వం క్రెడిట్ కోసం ఆలోచించదన్నారు. ప్రజలకు న్యాయం చేయడమే తమ సంకల్పమని సీఎం పేర్కొన్నారు. ఆర్&ఆర్ విషయంలో కేంద్రం నిధులకు తోడు రాష్ట్రం నిధులు అందిస్తామన్నారు. పోలవరం నిర్మాణంలో చంద్రబాబు బుద్ధిలేకుండా వ్యవహరించారని విమర్శించారు. పునరావాస ప్యాకేజీకి త్వరలోనే కేంద్రం ఆమోదం తెలుపుతుందన్నారు. పోలవరం పరిహారం కేంద్రం స్వయంగా చెల్లించినా పర్వాలేదన్నారు. బాధితులకు రావాల్సిన ప్యాకేజ్‌పై మంచి జరుగుతుందని సీఎం హామీ ఇచ్చారు. వరద సాయం అందలేదని ఒక్క ఫిర్యాదు రాలేదని.. ఏ ఒక్క బాధితుడు మిగిలిపోకుండా అధికారులు సాయం అందించారన్నారు. అధికారులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. బాధితులందరికీ సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
తాజావార్తలు
-
Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్‌కు త్రిషా కృష్ణన్.. విజయ్‌తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్‌లో చర్చ
-
India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
-
AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
-
BRICS Summit 2026: మోడీ-జిన్‌పింగ్ భేటీ.. బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన.. సదస్సు తొలి రోజు 10 కీలక విషయాలు
-
Aamir Khan: లోకేష్ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి.. మరో సూపర్‌హీరో మూవీకి ఆమిర్ ఖాన్ రెడీ! దర్శకుడు ఎవరంటే?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!