టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మైనింగ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఇసుకాసురుడు అంటు చంద్రబాబు జగన్‌పై ఆరోపణలు చేశారని, ఇసుక విధానం పై 19 సార్లు చంద్రబాబు జీవోలు తెచ్చారని పేర్కొన్న మంత్రి.. ఇసుకను దోచిన వారే ఆరోపణలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు.
ఆకాశంలో సూపర్ బ్లూ మూన్ కనువిందు చేసింది. రోజూ వచ్చే చంద్రుడిలాగా కాకుండా జాబిల్లి ఇవాళ(ఆగస్టు 30) పెద్దగా, అత్యంత కాంతివంతంగా కనిపించింది. భూమికి అత్యంత సమీపానికి చంద్రుడు వచ్చినపుడు పౌర్ణమి రావడంతో ఆకాశంలో ఈ అద్భుతమైన సూపర్ బ్లూ మూన్ అద్భుతం ఆవిష్కృతం అవుతుంది.
దాదాపు 80 శాతం మంది భారతీయులు ప్రధాని నరేంద్ర మోడీ పట్ల అనుకూలమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని ప్యూ రీసెర్చి సెంటర్ చేసిన సర్వే ప్రకారం వెల్లడైంది. ఈ సర్వే ప్రకారం కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి ఎవరితో ఉన్నారనే దానిపై ప్రశ్నార్థకంగా ఉందని, ఆమె బీజేపీతో పొత్తు పెట్టుకుందనే ఊహాగానాలు ఉన్నాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ బుధవారం అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఘజయాబాద్‌లో న్యాయవాదిని ఇద్దరు దుండగులు పట్టపగలే కాల్చి చంపారు. న్యాయవాది కార్యాలయంలోనే ఈ హత్య జరిగింది. బుధవారం మధ్యాహ్నం జిల్లా కోర్టు కాంప్లెక్స్ లోపల ఉన్న న్యాయవాది ఛాంబర్‌లోకి ప్రవేశించిన గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు నేరుగా ఆయనపై కాల్పులు జరిపారు.
చెప్పకుండా బయటకు వెళ్లడమే ఆ విద్యార్థులు చేసిన నేరం. అందుకు స్కూల్ ప్రిన్సిపల్ వారిని కర్రతో వాతలొచ్చే వరకు చితకబాదాడు. ఈ ఘటన మంగళవారం జార్ఖండ్‌లోని పాలములోని సత్బర్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని భోగు గ్రామంలో జరిగింది.
చైనా తన అధికారిక మ్యాప్‌ను విడుదల చేసింది. చైనా తన కొత్త మ్యాప్‌ను విడుదల చేసినప్పటి నుంటి భారత రాజకీయాల్లో వేడి పెరిగింది. ఈ కొత్త మ్యాప్‌లో భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్, తైవాన్, వివాదాస్పద దక్షిణ చైనా సముద్రాన్ని చైనా తన భూభాగంగా చూపింది.
రక్షాబంధన్ శుభ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కన్యా సుమంగళ యోజన మొత్తాన్ని పెంచుతున్నట్లు ప్రకటించడం ద్వారా రాష్ట్రంలోని ఆడపిల్లలకు భారీ కానుకను అందించారు.