అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని పదవి రేసులో లేరని ఢిల్లీ మంత్రి అతిషి బుధవారం అన్నారు. కేజ్రీవాల్ దేశానికి ఆదర్శప్రాయమైన ప్రధాని కాగలరని ఆప్ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ చేసిన వ్యాఖ్యలపై అతిషి స్పందిస్తూ .. ఇది ప్రధాన ప్రతినిధి వ్యక్తిగత అభిప్రాయం కావచ్చని.. కానీ అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని రేసులో లేరన్నారు.
దేశంలో రక్షాబంధన్ వేడుకల సందడి ప్రారంభమైంది. తోడబుట్టినవారికి జీవితాంతం అండగా ఉంటానని సోదరులు హామీ ఇచ్చే రోజు ఇది. అయితే, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో సోదరుడికి ఓ సోదరి అరుదైన రక్షాబంధన్ కానుక ఇచ్చింది.
కాంగ్రెస్ ఎంపీ అధిర్ రాజన్ చౌదరి సస్పెన్షన్‌ను లోక్‌సభ ప్రివిలేజెస్ కమిటీ రద్దు చేసింది. బుధవారం కాంగ్రెస్ ఎంపీ పార్లమెంటరీ కమిటీ ముందు హాజరైన తర్వాత సస్పెన్షన్‌ను రద్దు చేయాలని సిఫార్సు చేస్తూ తీర్మానాన్ని ఆమోదించింది.
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా చారిత్రాత్మక విజయం సాధించినందుకు భారతీయులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఓ భారతీయుడు బంగారు పతకం సాధించడం ఇదే తొలిసారి.
భార్యను కొట్టే, హింసించే హక్కు భర్తకు ఏ చట్టం ఇవ్వలేదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. క్రూరత్వం, పురుషుడు విడిచిపెట్టడం వంటి కారణాలతో ఓ మహిళకు విడాకులు మంజూరు చేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
భారత్‌లో జీ20 సమ్మిట్ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని మోడీకి ఫోన్ చేసినట్లు తెలిసింది. న్యూఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సులో పాల్గొనేందుకు తాను భారత్‌కు రాలేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీకి తెలిపారు.
భారత్-పాకిస్థాన్ మధ్య దౌత్య స్థాయిలో సంబంధాలపై కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి. దానికి కారణమేమిటంటే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన గీతిక శ్రీవాస్తవ పాకిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయానికి ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు.