విశాఖపట్నంలో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇంటర్ విద్యార్థిని రీతి సాహ కేసు సంచలనం రేపుతోంది. జూలై 14వ తేదీన భవనంపై నుంచి కిందపడి రీతి సాహా ప్రాణాలు కోల్పోయింది. నీట్ శిక్షణ కోసం కోల్‌కత్తా నుంచి విశాఖపట్నం వచ్చి చదువుకుంటున్న రీతి సాహా వ్యవహారం మిస్టరీగా మారింది.
రేపు(శుక్రవారం) కౌలు రైతులకు రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. రైతుల ఖాతాల్లో వర్చువల్‌గా సీఎం జగన్ నగదు జమ చేయనున్నారు. కౌలు రైతులతో పాటు దేవాదాయ భూమి సాగుదారులకు కూడా సాయం అందనుంది. మొత్తం 1,46,324 మందికి లబ్ది చేకూరనుంది.
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థుల అమెరికా కల సాకారమైంది. దేశవ్యాప్తంగా 30 మంది విద్యార్థులకు అవకాశం రాగా.. ఐదుగురు ఏపీ విద్యార్ధులకు చోటు దక్కింది.
ఆంధ్రప్రదేశ్‌లో వీఆర్‌ఏలకు జగన్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతో కాలంగా వీఆర్‌ఏలు ఎదురుచూస్తున్న అంశంపై ఇవాళ శుభవార్త అందించింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో తొలగించిన ఓ ఆర్ధిక ప్రయోజనాన్ని వారికి తిరిగి కల్పించడంతో పాటు దాన్ని పెంచాలని కూడా నిర్ణయించింది.
అంతర్జాతీయ స్టార్ క్రికెటర్ల అభిమాని విశాఖవాసి ఈశ్వర్ గుండెపోటుతో మృతి చెందాడు. ఐపీఎల్ జట్ల క్రికెటర్లకు బౌలింగ్ ప్రాక్టీస్ సమయంలో ఈశ్వర్ బౌలింగ్ చేసేవాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు "సైడ్ ఆర్మ్ త్రో" బౌలర్‌గా ఈశ్వర్ సేవలు అందిస్తున్నారు.
జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్షపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. భూ సంస్కరణల వల్ల ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాల పై విస్తృత్రంగా ప్రచారం చేయాలన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో రక్షా బంధన్ సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నారు. తమ తోబుట్టువులకు రాఖీలు కడుతున్నారు. శుభాకాంక్షలు చెబుతున్నారు.. దీంతో.. రాఖీ షాపులు, స్వీట్ షాపులు కలకలలాడుతున్నాయి. రక్షాబంధన్(రాఖీ పౌర్ణమి) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మకుమారీస్ రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు