ఏపీలోని రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. రాష్ట్రానికి మరో రేపటి నుంచి వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. దీనిని విజయవాడ-చెన్న నడపాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలకు ఇది మూడో వందేభారత్ రైలు కానుంది. రేపు ఉదయం 10:30 గంటలకు జెండా ఊపి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చారు. తిరువీధుల్లో స్వామివారి బంగారు తేరుపై ఊరేగారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై సోమవారం ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. సోమవారం ఏసీబీ కోర్టులో వాదనలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు తొలిరోజు సీఐడీ విచారణ ముగిసింది. రాజమండ్రి సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాలులోనే అధికారులు విచారణ చేపట్టారు. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని 12 మంది సభ్యుల బృందం ఆయన్ను ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు విచారించింది. చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ సమక్షంలో ఈ విచారణ కొనసాగింది.
గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పుణ్యక్షేత్రాలతో పాటు అనేక గ్రామాల్లో వన్య మృగాల సంచారం అధికమైంది. తిరుపతి, శ్రీశైలం సహా అనేక పుణ్యక్షేత్రాల్లో క్రూరమృగాల సంచారం ఎక్కువైపోయింది. దైవ దర్శనానికి వెళ్లే భక్తులపై దాడులకు పాల్పడుతుండడంతో భక్తులు భయాందోళన మధ్య క్షేత్రాలకు వెళ్తున్నారు.
అవినీతి కేసుల్లో పదేళ్లు బెయిల్‌పై బయట ఉన్న జగన్మోహన్ రెడ్డి, ప్రజాసేవకుడైన చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపారని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం మున్ముందు ఎలా ముందుకెళ్లాలో తానే కొత్త దారి చూపించాడని ఆయన వ్యాఖ్యానించారు.
ఆ చిన్నారి ఉదయాన్నే నిద్ర లేచింది. తలంటు స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంది. పుట్టినరోజు కావడంతో కుటుంబసభ్యుల తీసుకుంది. పాఠశాలకు వెళ్లి అందరికి చాకెట్లు పంచింది. అయితే.. ఆ చిట్టితల్లికి తెలియదు.. పుట్టిన రోజే తనకు ఆఖరి రోజు అవుతుందని. పుట్టిన రోజున ఆనందంగా గడిపిన ఆ చిన్నారి విషాదకర రీతిలో మృతి చెందింది.