దాదాది దేశమైన పాకిస్థాన్ భారత్‌పై ఎప్పుడూ తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉంటుంది. పాక్ మరోసారి భారత్‌పై విషం చిమ్మింది. పాకిస్థాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి జలీల్ అబ్బాస్ జిలానీ భారత్‌పై విషం చిమ్మడంలో బిలావల్ భుట్టో జర్దారీని సమం చేయడం ప్రారంభించారు.
సనాతన ధర్మంపై వ్యాఖ్యల విషయంలో తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వెనక్కి తగ్గడం లేదు. డీఎంకే నేత, తమిళనాడు క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి సనాతన ధర్మం నిర్మూలనపై మాట్లాడారు
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరణించారంటూ సోషల్ మీడియాలో వచ్చిన ఓ పోస్ట్ కలకలం సృష్టించింది. డోనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు డోనాల్డ్ ట్రంప్ జూనియర్ ట్విటర్ ఖాతా నుంచి ఈ పోస్ట్ వెలువడడం దీనికి కారణమైంది. అనంతరం ట్రంప్ కుమారుడు దీనికి వివరణ ఇచ్చారు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నారీ శక్తి వందన్ బిల్లు(మహిళా రిజర్వేషన్ బిల్లు) లోక్‌సభలో బంపర్ మెజార్టీతో ఆమోదం పొందింది. అత్యాధునిక సదుపాయాలతో కొత్త పార్లమెంట్ దిగువ సభ ఆమోదించిన తొలి బిల్లు ఇదే. ఈ బిల్లును న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
కేంద్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ "నారీ శక్తి వందన్ అధినియం 2023" పేరిట మంగళవారం రోజు సభలో ప్రవేశపెట్టారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల మూడో రోజు మహిళా రిజర్వేషన్ బిల్లుపై సభలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా కొత్త లోక్‌సభలో ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు అసంపూర్తిగా ఉందని రాహుల్ గాంధీ అభివర్ణించారు. లోక్‌సభలో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఈ బిల్లు అసంపూర్తిగా మారడానికి తన మనసులో ఒక విషయం ఉందన్నారు.
సాధారణంగా పెద్ద వయస్సులో ఉన్న వాళ్లను పెళ్లి చేసుకోవడం గురించి చాలా సార్లు వినే ఉంటారు. అయితే ఈ సారి మాత్రం ఓ యువకుడు 70 ఏళ్ల వయస్సు గల బామ్మను పెళ్లి చేసుకున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది పచ్చినిజం. ఈ పెళ్లి పాకిస్థాన్‌లో జరిగింది.
భారతదేశపు తదుపరి స్టార్టప్ పవర్‌హౌస్‌గా హైదరాబాద్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. భారతదేశంలోని మొదటి ఐదు స్టార్టప్ హబ్‌లలో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే టెక్ హబ్‌గా పేరున్న బెంగళూరు, ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్, పుణె నగరాలు మన కంటే ముందున్నాయి.