గతంలో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిపై సీఎం రివ్యూ మీటింగ్ చేసింది లేదని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రస్తుతం జిల్లాలోని చాలా సమస్యల పరిష్కారానికి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇరిగేషన్ , ఇండస్ర్టీలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
పంచ గ్రామాల సమస్యకు టైం బాండ్ పెట్టుకొని పరిష్కరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ భూముల గుర్తింపు, కేటాయింపు ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. విశాఖ జిల్లా కలెక్టరేట్‌లో శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నగరంలో గుంతల రోడ్లు ఉండటానికి వీలు లేదు.. ఎక్కడైనా ఉంటే అధికారులపై చర్యలు తప్పవన్నారు.
రాష్ట్రం వెంటిలేషన్ మీద ఉందని.. నేడు వెంటిలేటర్ మీద నుంచి ఆక్సిజన్ తీసుకునే పొజిషన్‌కు వచ్చిందన్నారు. ఎన్నికలలో హామీలు ఇచ్చారు, ఎప్పుడు నెరవేరుస్తారని ప్రశ్నిస్తారు కానీ.. ఈ రాష్ర్టానికి అప్పులు ఉన్నాయని చెబితే వినే పరిస్థితి లేదన్నారు.చంద్రబాబు రాష్ట్రంలో పుట్టడం అదృష్టమన్నారు. క్లిష్ట సమయంలో సీఎంగా చంద్రబాబు ఉన్నారని వెల్లడించారు.
తిరుపతిలో దీపం-2 పథకం కార్యక్రమాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే వారిపై ఛాలెంజ్ విసురుతున్నానని.. వైసీపీ నేతలు దీపం-2 పథకం కార్యక్రమాలకు రావాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉచిత సిలిండర్ ఇస్తున్న విషయాన్ని వైసీపీ నేతలు గమనించాలన్నారు.
విశాఖపట్నం కలెక్టరేట్‌లో విశాఖ, అనకాపల్లి జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండు మూడు రోజుల్లో రాష్ర్ట భవిష్యత్తును మార్చే కొత్త ప్రణాళిక ఆవిష్కరిస్తామన్నారు. పది పాయింట్లతో కూడిన అభివృద్ధి ప్రణాళికతో 2047 నాటికి అన్నింటా ముందంజలో ఉంటామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
తిరుపతిలోని ఓ లాడ్జిలో మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఫోక్సోకేసులో ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతిలోని ఓ విద్యాలయంలో ఆ బాలిక 9వ తరగతి చదువుతున్నట్లు తెలిసింది. బాలిక ప్రవర్తనను గమనించిన తల్లిదండ్రులు విషయం ఆరా తీసి అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
67వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్(సీపీసీ) కోసం ఎంపీ పురందేశ్వరి ఆస్ట్రేలియాకు పయనమయ్యారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ( సీపీఏ) ఇండియా రీజియన్ స్టీరింగ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు, మహిళా పార్లమెంటేరియన్, స్టీరింగ్ కమిటీకి ఛైర్‌పర్సన్ ఎంపీ పురంధేశ్వరి ఆస్ట్రేలియా దేశంలోని సిడ్ని నగరంలో 67వ సీపీసీలో పాల్గొననున్నారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ట్విట్టర్‌లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అబద్దాలు ఆడడంలో అంబటిది అందె వేసిన చెయ్యి అని.. ప్రాజెక్టు ఎత్తు తగ్గించినట్లు ఆధారాలు ఉంటే చూపాలన్నారు. నిద్రపోయే వాణ్ణి లేపవచ్చని.. నిద్ర నటించే వాణ్ణి ఎవరు లేపగలరని అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు.