MP Purandeswari: 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్(సీపీసీ) కోసం ఎంపీ పురందేశ్వరి ఆస్ట్రేలియాకు పయనమయ్యారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ( సీపీఏ) ఇండియా రీజియన్ స్టీరింగ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు, మహిళా పార్లమెంటేరియన్, స్టీరింగ్ కమిటీకి ఛైర్‌పర్సన్ ఎంపీ పురంధేశ్వరి ఆస్ట్రేలియా దేశంలోని సిడ్ని నగరంలో 67వ సీపీసీలో పాల్గొననున్నారు. ఆస్ట్రేలియాలో జరిగే 67 వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్(సీపీసీ)లో 50కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. మన దేశం నుంచి ఎంపీ పురంధేశ్వరి హాజరవుతున్నారు. ప్రపంచంలో మహిళలు ఎదుర్కొనే వివిధ సమస్యలపై సీపీసీలో చర్చించనున్నారు. మహిళల ప్రాతినిధ్యం పెంపు తదితర సమస్యలపై చర్చలు జరపనున్నారు. ఈనెల 10వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో జరిగే సమావేశాల్లో పాల్గొని, 11వ తేదీన తిరిగి ఇండియాకు రానున్నారు.
Read Also: Minister Rama Naidu: అంబటి రాంబాబుకు మంత్రి నిమ్మల స్ట్రాంగ్ కౌంటర్