రుషికొండ నిర్మాణాలు చూస్తే గుండె చెదిరే నిజాలు వెలుగు చూస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అధికారం అడ్డు పెట్టుకొని చేసే తప్పులకు ఇదో కేస్ స్టడీ అంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటివి సాధ్యమా అనిపించిందని.. కలలో కూడా ఊహించలేమన్నారు. ఇటువంటి నేరాలు చెయ్యాలంటే చాలా తెగించాలి.. ఒక వ్యక్తి విలాసాల కోసం ఇంత దారుణమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చాలా దేశాలు తిరిగానని, పాలకులను చూశాను కానీ ఒక సీఎం విలాసం కోసం పర్యావరణ విధ్వంసం చేసి ప్యాలెస్…
సీఎం చంద్రబాబు ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటన కొనసాగుతోంది. అయితే ముఖ్యమంత్రి పర్యటన ఆసక్తిని రేపుతోంది. అనకాపల్లి జిల్లా పర్యటన అనంతరం నేరుకు రుషికొండకు చేరుకున్నారు.
తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఏఎం పేట ఎస్టీ కాలనీలో అత్యాచారం, హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని హోంమంత్రి అనిత ఆదివారం పరామర్శించనున్నారు . అభం శుభం తెలియని చిన్నారికి చాక్లెట్లు ఆశ చూపి దారుణానికి పాల్పడిన నిందితుడిని చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని బాధిత కుటుంబాన్ని కలిసి స్వయంగా ఆమె భరోసా అందించనున్నారు .
కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల వద్ద యురేనియం తవ్వకాలను నిలిపివేయాలని చేపట్టిన ఆందోళనను గ్రామస్థులు తాత్కాలికంగా విరమించారు. ఈ నెల 4వ తేదీన కలెక్టర్ వచ్చి చర్చిస్తారనే హామీతో ప్రజలు ఆందోళనను విరమించారు.
కులగణన కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్రంలో చేపట్టబోయే ఈ కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలవబోతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త కీలకంగా తీసుకోవాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటివరకు అమలు చేయలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానం అమలు చేయాలన్నారు. ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారని చెప్పుకొచ్చారు.
బీఆర్ఎస్ స్థానంలోకి బీజేపీ పోదని.. బీఆర్ఎస్‌కు ప్రజలు వీఆర్‌ఎస్ ( రిటైర్ మెంట్)ఇచ్చారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తుంది.. ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని.. కేటీఆర్ రేవ్ పార్టీలని తిరుగుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
గాంధీభవన్‌లో బీసీ కులగణనపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగుతున్న సమావేశంలో మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సలహాదారులు, కార్పొరేషన్ ఛైర్మన్‌లు పాల్గొన్నారు. ఏఐసీసీ నాయకులు కొప్పుల రాజు సమావేశంలో కులగణన ప్రాధాన్యతను వివరించారు.
గిరిజన బాలిక సాయిశ్రద్ధకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు. కుమురం భీం జిల్లా జైనూరు మండలం జెండాగూడ గ్రామానికి చెందిన గిరిజన బాలిక సాయిశ్రద్ధ.. ఎంబీబీఎస్ లో సీటు సాధించినా కాలేజీ ఫీజు కట్టేందుకు ఆర్ధిక స్థోమత లేక ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటోంది.
MLA Payal Shankar: మాజీ మంత్రి జోగు రామన్నకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం పత్తికి తక్కువ ధర ఇస్తుందని బీఆర్‌ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో సీసీఐ ఒకే ధర ఉంటుందన్నారు. సీసీఐ గుజరాత్‌లో ఎక్కువ ధర ఉంది అంటే తాను రాజీనామా చేస్తానన్నారు. బీజేపీ ఎంపీ,ఎమ్మెల్యే ఎక్కుడున్నారని అన్న జోగు రామన్న వ్యాఖ్యలకు ఎమ్మెల్యే స్పందించారు. మార్కెట్ యార్డులో రైతులు ఇబ్బంది పడుతుంటే నువ్వెక్కడ […]