రైతును నిలబెట్టి, సాగును మరింత ప్రోత్సహించేందుకు అవసరమైనన్ని నూతన విధానాలను రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. నేటి ఆధునిక యుగంలో సాంకేతికతను వినియోగించి రైతులకు సాగు ఖర్చులు గణనీయంగా తగ్గించవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. నాడు ఐటీ ఎలా అయితే గేమ్ ఛేంజర్ అయ్యిందో.. రానున్న రోజుల్లో పకృతి వ్యవసాయం కూడా గేం ఛేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
మంగళవారం అనంతపురం జిల్లాలో డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవడం కోసం హోంమంత్రి వంగలపూడి అనిత ఇప్పటికే అనంతపురం నగరానికి చేరుకున్నారు.
ప్రజలు ఓట్లు వేసి గెలిస్తే సరిగ్గా పరిపాలన చేసే వారేమో కానీ ఈవీఎంతో గెలిచారు కాబట్టి పరిస్థితి ఇలా ఉందని మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర విమర్శలు చేశారు. హోంమంత్రి విఫలం అయ్యారని తోటిమంత్రి పవన్ చెప్పాడు కాబట్టి అనిత ఆమె పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
గృహ నిర్మాణ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. 2029 నాటికి అర్హులైన అందరికీ ఇళ్లు నిర్మించే లక్ష్యంతో పని చేయాలని సీఎం అన్నారు. రాష్ట్రంలో పీఎంఏవై 2.0 పథకం ప్రారంభించేందుకు కేంద్రంతో ఎంఓయూ కుదుర్చుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
బియ్యం అక్రమ రవాణా అడ్డుకట్టకు సహకరించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ మిల్లర్లను కోరారు. జాతీయ రైస్ మిల్లర్స్ అసోయేషన్ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్.. మిల్లర్లపై మార్కెట్ సెస్ 2 శాతం నుంచి 1 శాతానికి తగ్గించాలని మంత్రుల సమావేశంలో చర్చించామన్నారు. బియ్యం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా సహకరిస్తామని మిల్లర్లు హామీ ఇచ్చారు.
ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఏపీ శాసన సభ సమావేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. శాసన సభ , శాసన మండలి సమావేశాల నోటిఫికేషన్‌ను రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ జారీ చేశారు.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో టీడీపీ ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్( NIPER) త్వరగా ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డాను కోరారు. నైపర్ సంస్థ గడచిన ఆరేళ్లుగా ఆగిపోయిందని.. దాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేసే విషయంపై ఎంపీ చర్చించారు.
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నూతన క్రీడా విధానంపై సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. స్పోర్ట్స్ ఫర్ ఆల్ విధానంతో నూతన క్రీడా పాలసీకి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు.
వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత రైతులకు సాగునీరు ఇవ్వటమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఒంగోలు కలెక్టరేట్ లో జరిగిన డీఆర్సీ సమావేశానికి ఆయనతో పాటు మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, జిల్లాకు చెందిన టీడీపీ, వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ఏపీ సచివాలయంలో ధరల పర్యవేక్షణ పై మంత్రుల కమిటీ భేటీ అయింది. రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల, వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ధరల పర్యవేక్షణ పై మంత్రుల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖామంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బియ్యం, కందిపప్పు, టమాటా, ఉల్లి ధరల నియంత్రణపై చర్చించారు.