తాము ఏ కార్యక్రమం చేసినా పని పెట్టుకుని బురద జల్లుతున్నారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన కులాలు అంటే కేసీఆర్, హరీష్, కేటీఆర్‌లకు చిన్న చూపు అంటూ మండిపడ్డారు. బలహీన వర్గాలకు చెందిన మహేష్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు అయ్యారని, దళితుడు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అయ్యారని తెలిపారు.
జనావస సముదాయల్లో టపాసుల దుకాణాలు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి ఒక పెద్ద వేడుక ఈ పండగ సందర్భంగా జరిగే అగ్నిప్రమాదాలు నివారించడానికి టపాసుల కాల్చేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. ప్రతి సంవత్సరం దీపావళి కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తారు. దేశమంతటా ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున ఇళ్లను దీపాలు, దీపాలతో అలంకరిస్తారు. దీపావళి రోజు సాయంత్రం లక్ష్మీదేవిని పూజిస్తారు కార్తీక మాసంలోని కృష్ణ పక్ష అమావాస్య తేదీన దీపావళి పండుగ జరుపుకుంటారు.
Road Accident: హైదరాబాద్‌లోని షాపూర్ నగర్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వాహనదారుడిని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగంతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రాథమిక దర్యాప్తులో మృతుడు రాంకీ సంస్థలో పనిచేసే హరికృష్ణగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ఘటనాస్థలిలో ప్రమాదానికి కారణమైన బస్సుపై వాహనదారులు దాడి చేసి అద్దాలను పగలగొట్టారు. ఉదయం రోడ్లపై పని చేస్తున్న మున్సిపల్ కార్మికులు, స్థానికులు రోడ్డుపై […]
మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసుపై నేడు నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు విచారణ జరపనుంది. గత విచారణలో కేటీఆర్, దాసోజు శ్రవణ్ ల స్టేట్మెంట్ రికార్డ్ చేసిన కోర్టు.. ఈ రోజు మిగతా ముగ్గురు సాక్షులు తుల ఉమ, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్ ల స్టేట్మెంట్‌లను కోర్టు రికార్డ్ చేయనుంది.
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని మూడు విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. హైదరాబాద్ నుండి చెన్నై వెళ్లాల్సిన రెండు ఇండిగో విమానాలు, చెన్నై నుండి హైదరాబాద్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్‌ఎఫ్ వర్గాలు అప్రమత్తమయ్యాయి.
ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు బీసీ కులగణనపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ఇవాళ గాంధీ భవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కార్పొరేషన్ ఛైర్మన్‌లతో కీలక సమావేశం జరగనుంది. టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇందిరా డెయిరీని రూపొందించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో ఇందిరా డెయిరీ లోగో ఆవిష్కరణ సందర్భంగా మహిళలను ఉద్దేశించి ఉపముఖ్యమంత్రి మాట్లాడారు.
రైతులు తీసుకొచ్చిన పత్తిలో కోత విధిస్తే సహించబోమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. వేబ్రిడ్జి కాటాలో తేడా వస్తే మిల్లు సీజ్ చేయిస్తామన్నారు. ఈ సంవత్సరం అధిక వర్షాలతో పత్తి పంట నష్టపోయారని చెప్పారు. రెండు లక్షల ఎకరాల్లో 20 టన్నుల పంట ఉత్పత్తి అవుతుందని.. తొమ్మిది సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు.
అక్రమ పటాకుల నిల్వలే హైదరాబాద్‌లో ప్రమాదాలకు కారణమని జిల్లా ఫైర్ అధికారి వెంకన్న వెల్లడించారు. అక్రమ గోదాంలపై నిఘా కొనసాగుతోందన్నారు. వెండర్స్ నకిలీ క్రాకర్స్ అమ్మకాలు జరపొద్దని.. లేబుల్ ఉన్న క్రాకర్స్ మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. నివాసం, సముదాయాల ప్రాంతాల్లో క్రాకర్స్ దుకాణాలకు అనుమతి లేదన్నారు.