ఐదు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉద్దేశించిన రూ.1,760 కోట్ల విలువైన ఉచితాలు, డ్రగ్స్, నగదు, మద్యం, విలువైన లోహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం సోమవారం వెల్లడించింది.
కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో అఫ్జల్‌పూర్ తాలూకాలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రమాదవశాత్తూ వేడివేడిగా ఉన్న సాంబార్ పాత్రలో పడిన మూడు రోజుల తర్వాత రెండో తరగతి విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది.
న్యాయ ప్రయోజనాల కోసం వేరే రాష్ట్రంలో కేసు దాఖలు చేసినప్పటికీ, హైకోర్టులు, సెషన్స్ కోర్టులు ముందస్తు అరెస్టు బెయిల్ మంజూరు చేయగలవని, అది అసాధారణమైన పరిస్థితులలో మాత్రమే చేయవలసి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక రాష్ట్రంలో నేరం జరిగితే మరో రాష్ట్రంలో ఎఫ్‌ఐఆర్ నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్‌కు సంబంధించిన మార్గదర్శకాలను ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు ఈ ప్రకటన చేసింది.
ఇంఫాల్ విమానాశ్రయం సమీపంలో గుర్తుతెలియని ఎగిరే వస్తువు కలకలం సృష్టించింది. ఆదివారం మణిపూర్‌లోని ఇంఫాల్ విమానాశ్రయానికి సమీపంలో 'అజ్ఞాత ఎగిరే వస్తువు' (UFO) కనిపించిందని సమాచారం అందుకున్న భారత వైమానిక దళం రెండు రాఫెల్ ఫైటర్ జెట్‌లను రంగంలోకి దించింది.
అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు శబరిమల వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది.
ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోవడంతో పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలో 23 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.
భారత ఆర్థిక వ్యవస్థలో చరిత్రాత్మక వృద్ధి నమోదైంది. మొట్టమొదటిసారిగా, భారతదేశ ఆర్థిక వ్యవస్థ 4 ట్రిలియన్ డాలర్లను దాటింది. దీనితో ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా అవతరించడానికి చాలా దగ్గరగా వచ్చింది. భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడానికి ఇది ఒక పెద్ద అడుగు.
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అందరినీ ఆశ్చర్యపరిచారు. మైక్రోసాఫ్ట్‌లో చాట్‌జీపీటీ డెవలపర్ ఓపెన్‌ఏఐ నుంచి సామర్థ్యంపై నమ్మకం లేదనే కారణంతో ఓపెన్‌ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్ తన పదవి నుంచి తొలగించబడ్డారు. కంపెనీ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ సీఈవో పదవి నుంచి తొలగించబడిన వెంటనే ఓపెన్‌ఏఐ మాజీ సహ వ్యవస్థాపకుడు గ్రెగ్ బ్రాక్‌మన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న దుష్టశక్తులను తొలగించాలంటూ ప్రభుత్వ ఉద్యోగులతో క్రైస్తవ మత ప్రార్థనలు చేయించాడో అధికారి. ఈ ఘటన కేరళలోని త్రిస్సూర్ చిన్నారుల సంరక్షణ కార్యాలయంలో జరిగింది. దీనిపై దర్యాప్తు చేయాలని సబ్ కలెక్టర్‌ను ఆదేశించినట్లు కలెక్టర్ కృష్ణతేజ తెలిపారు.