బిల్లుల క్లియరింగ్‌లో గవర్నర్ ఆర్‌ఎన్ రవి జాప్యంపై తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణను ప్రారంభించింది. హైకోర్టులకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేసినట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని హైకోర్టులకు సుప్రీంకోర్టు తెలిపింది.
కులగణనపై సీఎం జగన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని అందరూ అభినందిస్తున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. బీహార్‌లో కులగణనకు రాజకీయ కోణం ఉందని ఆయన అన్నారు.
భక్తి టీవీ కోటిదీపోత్సవం వైభవంగా సాగుతోంది. ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి దీపోత్సవం ఐదో రోజు ఘనంగా ముగిసింది. నవంబర్ 14న ప్రారంభమైన కోటి దీపోత్సవ మహోత్సవం మహోద్యమంగా కొనసాగుతోంది.
విశాఖపట్నంలో జరిగిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో మంత్రి సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు. దశాబ్దాలుగా బడుగు బలహీనర్గాల వారు సంక్షేమం, అభివృద్ధికి దూరంగా ఉన్నారని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు మైనార్టీలను టీడీపీ కూరలో కరివేపాకులా వాడిందని ఆయన మండిపడ్డారు.
నంద్యాల జిల్లా బనగానపల్లెలో నాపరాతి గనుల యజమానులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, కలెక్టర్ మున్జీర్ సామూన్ జిలానీ, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిలు పాల్గొన్నారు.
బీసీలను నిర్లక్ష్యం చేస్తూ, వారికి అన్యాయం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పతనం తప్పదని వివిధ పార్టీలకు చెందిన బీసీ నాయకులు వ్యాఖ్యానించారు. రాజమండ్రి ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
తూర్పు గోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లో బ్యాంకుల వద్ద అమాయక మహిళలను టార్గెట్ చేస్తూ పలు మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు గుర్తించి పట్టుకున్నారు.
'సకల జనుల సౌభాగ్య తెలంగాణ' పేరుతో బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విడుదల చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులు, పెన్షనర్లకు 1వ తేదీనే వేతనాలు చెల్లిస్తామన్నారు. బీసీ అభ్యర్థినే సీఎంను చేస్తామని ప్రకటించారు.
వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అనంతపురం జిల్లాలో బెట్టింగురాయుళ్లపై ప్రత్యేక నిఘా విధించింది సైబర్‌సెల్. అనంతపురం పోలీస్ సైబర్ సెల్ ద్వారా సుమారు 70 బెట్టింగ్ ఆన్‌లైన్ యాప్‌లను గుర్తించారు. ఈ యాప్‌లను నిషేధించాలని సంబంధిత శాఖలకు జిల్లా ఎస్పీ సిఫారసు లేఖ రాశారు. క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడినా, నిర్వహించినా, ప్రోత్సహించినా ఉపేక్షించమన్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువను వివరించేందుకు విజయవాడలో జరిగిన యువ ఓటర్ చైతన్య వేదిక కార్యక్రమానికి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తమ కాలేజీ పీఎస్సీఎంఆర్ కాలేజ్.. అందుకే ఇక్కడి నుండే ఈ పోగ్రాం మెదలుపెట్టానని జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.