అల్లూరి సీతారామరాజు జిల్లా ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో భద్రతా బలగాలనకు పెనుముప్పు తప్పింది. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల భారీ డంపును ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మత్తిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కిరిమితి, తులసి అటవీ ప్రాంతంలో భారీ డంప్ బయటపడింది.
మార్కాపురంలో టీడీపీ నేతల భూకబ్జా బాగోతం బట్టబయలైంది. కోట్ల రూపాయలు విలువ చేసే భూములను అక్రమంగా పేదల నుంచిస్వాధీనం చేసుకున్న భూదందా నియోజకవర్గంలో సంచలనంగా మారింది.
ఏపీలో జనసేన పార్టీకి బిగ్‌షాక్ తగిలింది. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ ఇంఛార్జి సందీప్ రాయల్‌తో పాటు రాయలసీమ రీజియన్ ఇంఛార్జి పద్మావతి పసుపులేటిలు పార్టీకి గుడ్‌బై చెప్పారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సజ్జల రామకృష్ణారెడ్డి. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సంచలన ఆరోపణలు చేశారు.
ఈ ఎన్నికలు ఆశామాషీ ఎన్నికలు కాదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి యాత్రలో రేవంత్ మాట్లాడారు. పదేళ్లలో పోడు భూముల సమస్య తీర్చలేదు.. లంబాడాలను ఆదుకోలేదని ఆయన విమర్శించారు.
దిశ రాష్ట్ర స్ధాయి కమిటీ సమావేశం ఇవాళ జరిగిందని.. మొదటిగా ఈ సమావేశం చాలా ఆలస్యంగా జరిగిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. ఉచిత బియ్యం పక్కదారి పడుతోంది అని కూడా సమావేశంలో మాట్లాడానని ఆయన తెలిపారు. ఈ కమిటీలో కేంద్ర పధకాల అమలు గురించి చర్చించామన్నారు. ఉపముఖ్యమంత్రి ముత్యాల నాయుడి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగిందన్నారు.