జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి ప్రచారం నిర్వహించారు. మండలంలోని వనమొనిగూడతండా, నామ్యతండా, బిల్డింగ్ తండా, హేమాజిపూర్, తిమ్మారెడ్డిపల్లి, నేలబండతండా, పొలిమేరబండతండా తదితర గ్రామాల్లో లక్ష్మారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించారు. పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర మంత్రి ఉషాశ్రీచరణ్, ట్రస్ట్ సభ్యులు రత్నాకర్ స్వాగతం పలికారు.
నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో అన్నీ రంగాల్లో సాధికారత సాధించామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. రాజకీయంగా అన్నీ వర్గాలను చెయ్యి పట్టుకుని నడిపించామని ఆయన వెల్లడించారు. గతంలో టీడీపీ హయాంలో ఎన్నికల సమయంలో మాత్రమే అణగారిన వర్గాలు గుర్తుకు వచ్చేవని మంత్రి పేర్కొన్నారు.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ఇప్పుడు 45వ రోజుకు చేరుకుంది. అయితే అక్టోబర్ 7 దాడుల సూత్రధారి యాహ్యా సిన్వార్‌ను ఇజ్రాయెల్ సైన్యం ఇంకా కనుగొనలేకపోయింది. గత వారం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు యాహ్యా సిన్వార్‌ను దూషించారు. అతనిని జర్మన్ నియంత హిట్లర్‌తో పోల్చారు. యాహ్యా సిన్వార్ హిట్లర్‌లా దాక్కుంటున్నాడని, గాజా ప్రజలు నిరంతరం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నెతన్యాహు ఆరోపించారు.
ప్రకృతి వైపరీత్యాలకు జపాన్ పెట్టింది పేరు. ఒకవైపు భూకంపాలు, మరోవైపు తుపానులు ఆ దేశాన్నిఅతలాకుతలం చేస్తూ ఉంటాయి. తాజాగా జపాన్ కు నాలుగువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పపువా న్యూ గినియా దీవుల్లో పేలిన ఓ అగ్ని పర్వతం కారణంగా జపాన్ కు సునామీ ముంపు తప్పేటట్లు కనిపించడం లేదు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం తన తండ్రి రాజీవ్ గాంధీని ఉద్దేశించి రాహుల్ గాంధీ పేరును తప్పుగా పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ వెంటనే కాంగ్రెస్ నాయకుడిపై విరుచుకుపడడంతో పాటు ఎగతాళి చేసింది.
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధానికి పరిష్కారం కనుగొనడానికి చైనా మిడిల్ ఈస్ట్ దేశాల సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో పాల్గొన్న మధ్యప్రాచ్య దేశాలు ఇజ్రాయెల్‌పై నిందలు మోపాయి. ఇజ్రాయెల్ పాలస్తీనియన్ల ఉనికిని తొలగించాలని కోరుకుంటోందని చెప్పారు. సమావేశంలో అన్ని ఇబ్బందులకు ఇజ్రాయెల్‌ను నిందించడం ఎటువంటి పరిష్కారాన్ని ఇవ్వదు.
ఉత్తరకాశీలో రెస్క్యూ ఆపరేషన్‌లో పెద్ద పురోగతి చోటుచేసుకుంది. దాదాపు రోజుల క్రితం సొరంగం కూలిపోవడంతో చిక్కుకున్న 41 మంది కార్మికులకు 6 అంగుళాల వెడల్పు గల ప్రత్యామ్నాయ పైపు చేరుకోగలిగింది. చిక్కుకుపోయిన కార్మికులకు ప్లాస్టిక్ బాటిళ్లలో పౌష్టికాహారం పంపాలని అధికారులు యోచిస్తున్నారు.
ఎయిరిండియాను బెదిరిస్తూ ఇటీవల వీడియో విడుదల చేసిన ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోమవారం కేసు నమోదు చేసింది.